Venkatesh - Rana: నెట్ఫ్లిక్స్ కోసం జతకట్టనున్న రానా మరియు వెంకటేష్

Venkatesh and Rana Daggubati Joins Together for Netflix Web Series
x

Rana Daggubati and Venkatesh: (Photo: The Hans India)

Highlights

Venkatesh - Rana Daggubati: థియేటర్ల లాక్ డౌన్ పుణ్యమా అని ఈ మధ్య ఓటిటి లకి మరియు వెబ్ సిరీస్ కి ఉన్న క్రేజ్ విపరీతంగా పెరిగిపోయిందని చెప్పుకోవాలి....

Venkatesh - Rana Daggubati: థియేటర్ల లాక్ డౌన్ పుణ్యమా అని ఈ మధ్య ఓటిటి లకి మరియు వెబ్ సిరీస్ కి ఉన్న క్రేజ్ విపరీతంగా పెరిగిపోయిందని చెప్పుకోవాలి. అయితే డిజిటల్ దిగ్గజం గా చెప్పుకోబడే నెట్ఫ్లిక్స్ మాత్రం మంచి కంటెంట్ ను అందించడంలో పూర్తిగా విజయం సాధించలేదని చెప్పుకోవాలి. ఈ మధ్యనే విడుదలైన 'నవరస' కూడా అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా నెట్ఫ్లిక్స్ స్టార్ హీరోల నుంచి కంటెంట్ కోసం ప్రయత్నిస్తోంది. తాజా సమాచారం ప్రకారం రానా దగ్గుబాటి నెట్ ఫిక్స్ తో ఒక వెబ్ సిరీస్ డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం.

రానా ఈ ప్రాజెక్టును నిర్మించడం మాత్రమే కాక ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు కూడా. తనతోపాటు విక్టరీ వెంకటేష్ కూడా ఈ వెబ్ సిరీస్ లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. తాజాగా "నారప్ప" సినిమాను విడుదల చేసిన వెంకటేష్ తన తదుపరి సినిమా "దృశ్యం 2" కూడా డిజిటల్ ప్లాట్ ఫామ్ పై విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వెబ్ సిరీస్ తో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు మన వెంకీ మామ. ఇక నెట్ఫ్లిక్స్ కోసం రానా మరియు వెంకీ చేయబోతున్న వెబ్ సిరీస్ గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories