Chiranjeevi: వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కావాలని కోరుకుంటున్నా

Chiranjeevi: ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కావాలన్నారు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.

Arun Chilukuri
Published on: 17 Nov 2021 7:09 PM IST
Venkaiah Naidu Should be Made President of India Says Chiranjeevi
X

Chiranjeevi: వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కావాలని కోరుకుంటున్నా

Chiranjeevi: ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కావాలన్నారు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. హైదరాబాద్‌లో జరిగిన ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న మెగాస్టార్ వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని వ్యాఖ్యానించారు. ఉప రాష్ట్రపతిగా వెంకయ్య ఎన్నో సేవలందించారన్న చిరంజీవి వెంకయ్య రాష్ట్రపతి కావాలని తెలుగు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

ప్రస్తుతం రాష్ట్రపతిగా ఉన్న రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం వచ్చే సంవత్సరం జులై నాటికి పూర్తి కానున్న సంగతి తెలిసిందే. 2017లో భారత ప్రథమ పౌరుడిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో చిరంజీవి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story