Veera Simha Reddy: బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ వేదిక మార్పు

Veera Simha Reddy: ఏబీయం కాలేజీ గ్రౌండ్‌ సురక్షితం కాదని పోలీసుల అభ్యంతరం

Jyothi
Published on: 5 Jan 2023 8:16 AM IST
Veera Simha Reddy Pre Release Event Venue Changed
X

Veera Simha Reddy: బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ వేదిక మార్పు

Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ వీరసింహరెడ్డి. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్ వేదిక మారనుంది. ముందుగా నిర్ణయించినట్లుగా ఒంగోలు ABM గ్రౌండ్‌లో రేపు ప్రి రిలీజ్ ఫంక్షన్ జరగాల్సి ఉంది. అయితే ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది. నగరం మధ్యలో ఎలాంటి ఈవెంట్ జరపడానికి వీల్లేదని అధికారులు, పోలీసులు అనుమతి నిరాకరించారు. ABM కాలేజీ గ్రౌండ్‌ సురక్షితం కాదని పోలీసుల అభ్యంతరం వ్యక్తం చేశారు. నగరం మధ్యలో ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తే.. స్థానికంగా ఉండే అభిమానులతో పాటు పక్క జిల్లాల నుంచి బాలకృష్ణ అభిమానులు తాకిడి ఎక్కువగా ఉంటుందని పోలీసులు అంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడటంలో భాగంగా వీరసింహారెడ్డి ప్రి రిలీజ్ ఈవెంట్ వేదిక మార్చుకోవాలని మూవీ యూనిట్‌కు సూచించినట్లు సమాచారం. ఈవెంట్‌కు పర్మిషన్ రాకపోవడంతో వీరసింహరెడ్డి మూవీ యూనిట్ ప్రత్యామ్నాయ వేదిక కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది.

Jyothi

Jyothi

Next Story