Varun Tej's Ghani: "గని" చిత్ర విడుదలపై క్లారిటీ ఇచ్చిన చిత్ర బృందం

Varun Tej’s Ghani Movie To Release in Theatres This Diwali 2021
x

Varun Tej’s Ghani: "గని" చిత్ర విడుదలపై క్లారిటీ ఇచ్చిన చిత్ర బృందం

Highlights

Varun Tej’s Ghani: ఈమధ్యనే గద్దలకొండ గణేష్ సినిమా తో మంచి హిట్ ను అందుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్..

Varun Tej's Ghani: ఈమధ్యనే గద్దలకొండ గణేష్ సినిమా తో మంచి హిట్ ను అందుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పుడు "గని" అనే ఒక స్పోర్ట్స్ డ్రామా తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఒక బాక్సర్ పాత్రలో ప్రేక్షకులను మెప్పించనున్నాడు. బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. నిజానికి ఈ సినిమా జులై 30 2021 న విడుదల కావాల్సి ఉంది. ఈ విడుదల తేదీ తో దర్శక నిర్మాతలు పోస్టర్లను సైతం విడుదల చేశారు.

కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా థియేటర్లు మళ్లీ మూతపడటంతో "గని" సినిమా విడుదల కూడా వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ గురించి చిత్రబృందం క్లారిటీ ఇచ్చేసింది. "గని" ఈ ఏడాది దీపావళి సందర్భంగా విడుదల కాబోతుందట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సిద్దు ముద్ద మరియు అల్లు బాబి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు మరియు నవీన్ చంద్ర ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. థమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories