VarunTej: మల్టీ స్టారర్ సినిమా ఈ హీరోలతోనే చేస్తాను అంటున్న వరుణ్ తేజ్...

VarunTej: ఇప్పటికే వెంకటేష్ తో కలిసి "ఎఫ్ 2" అనే సినిమా మల్టీస్టారర్ సినిమాలో నటించిన వరుణ్ తేజ్...

Shireesha
Published on: 7 April 2022 1:39 PM IST
Varun Tej Wants to do Multi Starer with Sai Dharam Tej and Nithin | Live News
X

VarunTej: మల్టీ స్టారర్ సినిమా ఈ హీరోలతోనే చేస్తాను అంటున్న వరుణ్ తేజ్...

VarunTej: ఈ మధ్యనే "ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్టేషన్", "గద్దలకొండ గణేష్" వంటి సినిమాలతో మంచి హిట్లు అందుకున్న యువ హీరో వరుణ్ తేజ్ తాజాగా ఇప్పుడు పలు ఆసక్తికరమైన సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే మెగా కుటుంబం నుంచి వచ్చిన వరుణ్ తేజ్ ఇప్పటిదాకా మెగా హీరోతో కలిసి వెండితెరపై కనిపించింది లేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మల్టీ స్టారర్ సినిమా చేయాలని ఆసక్తి తనకు కూడా ఉందని అన్నారు వరుణ్ తేజ్.

అయితే ఏ హీరోలతో మల్టీస్టారర్ సినిమాల్లో నటించాలని అనుకుంటున్నారు అని అడగగా వరుణ్ తేజ్ ఆసక్తికరమైన జవాబిచ్చారు. మల్టీ స్టారర్ సినిమా చేయాల్సి వస్తే సాయిధరమ్ తేజ్ లేదా నితిన్ తో సినిమా చేయాలని ఉంది అని అన్నారు వరుణ్ తేజ్. ఇప్పటికే వెంకటేష్ తో కలిసి "ఎఫ్ 2" అనే సినిమా మల్టీస్టారర్ సినిమాలో నటించిన వరుణ్ తేజ్, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మరియు నితిన్ లతో మల్టీస్టారర్ చేయడానికి రెడీ అనడం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో "గని" అనే సినిమాతో ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అలాగే వరుణ్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో "ఎఫ్ 3" సినిమాతో బిజీగా ఉన్నారు.

Shireesha

Shireesha

Next Story