Varun Tej: వెంకీ కుడుములతో వరుణ్ తేజ్ న్యూ మూవీ

Varun Tej: దసరాకి వరుణ్ తేజ్ తో బ్లాక్ బస్టర్ దర్శకుడు వెంకీ కుడుముల కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని టాలీవుడ్ టాక్.

Kranthi
Published on: 13 May 2021 2:08 PM IST
Varun Tej Venky Kudumula Film Starts From Dasara
X

Varun Tej Venky Kudumula:(File Image)

Varun Tej: టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుములతో వరుణ్ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ టాక్. ఇటీవలే ఆ డైరెక్టర్ చెప్పిన స్టోరీలైన్ విన్న వరుణ్.. నచ్చి వెంటనే కథకు ఓకే చెప్పినట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే గని దాదాపు పూర్తవ్వడంతో అన్ని కుదిరితే 'ఎఫ్ 3' షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగును దసరాకి మొదలుపెట్టాలనే నిర్ణయానికి వచ్చారని తాజా సమాచారం.

ఈ సినిమా స్క్రిప్ట్ చాలా బాగా వచ్చిందనీ, తనకి హ్యాట్రిక్ హిట్ తెస్తుందని వెంకీ కుడుముల భావిస్తున్నాడట. ఇక వెంకీ తన తొలి రెండు సినిమాల్లో హీరోయిన్‌గా రష్మిక మందన హీరోయిన్‌గా చేసింది. అయితే ఈ సినిమాలో కూడా ఆమెనే హీరోయిన్‌గా తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. ఇక వరుణ్ ప్రస్తుతం నటిస్తున్న గని సినిమా విషయానికి వస్తే.. మెగా కుటుంబం నుంచి వచ్చి తనదైన స్టైల్లో నటిస్తూ కథల ఎంపిక విషయంలో కొత్తదనం చూపిస్తూ టాలీవుడ్‌లో ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నాడు. బాక్సింగ్ బ్యాగ్ డ్రాప్‌లో వస్తోన్న ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు.

వరుణ్ మొదట్లో కథల విషయంలో తడబడ్డ.. ఆ తర్వాత మూస కథలతో వచ్చే సినిమాలను పక్కన పెట్టిన వరుణ్ కొత్తరకం కథలను ఎంచుకోవడం చేయడం మొదలు పెట్టారు. దీంతో వరుస విజయాలను వరుణ్ సొంతం చేసుకుంటున్నారు. ఈ చిత్రం కోసం వరుణ్ ప్రత్యేకంగా బాక్సింగ్ శిక్షణ తీసుకున్నారు. ఈ సినిమా దాదాపు రూ.35 కోట్లతో భారీగా తెరకెక్కుతోంది. వరుణ్‌కు జోడిగా ప్రముఖ హిందీ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Kranthi

Kranthi

Next Story