Varun Tej: జిమ్ లో వర్కౌట్లు చేస్తున్న వరుణ్ తేజ్...సోషల్ మీడియాలో చక్కర్లు

Varun Tej: స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వస్తున్న గని సినిమా కోసం కఠోరదీక్షతో వర్కౌట్ చేస్తున్నాడు.

Kranthi
Published on: 30 Jun 2021 3:37 PM IST
Varun Tej Gym Workout Videos go Viral on Social Medi
X

Varun Tej Ghani Movie:(File Image)

Varun Tej: మెగా కుటుంబం నుంచి హీరోగా వెండితెరపై ఆరంగేట్రం చేసినప్పటికీ వరుణ్ తేజ్ విలక్షణ కథలను ఎంచుకుంటూ తనదైన స్టైల్ నటన కనబర్చుతున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'గని' అనే ఇంటరెస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. సినిమా కోసం బాక్సింగ్ లో శిక్షణ కూడా తీసుకున్నాడు ఈ మెగా హీరో. అయితే బాక్సింగ్ లో శిక్షణ కోసం విదేశాలకు వెళ్లడం.. ఆ తరువాత కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో షూటింగ్ వాయిదా పడింది.

తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో హల్ చల్ చేస్తుంది. ఈ వీడియోలో వరుణ్ చాలా కఠోరదీక్షతో వర్కౌట్ చేస్తున్నాడు. తనతో పాటు ట్రైనర్స్ కూడా ఉన్నారు. ఈ చిత్రానికి సల్మాన్ తో సుల్తాన్ సినిమాకు పనిచేసిన యాక్షన్ డైరెక్టర్స్ పనిచేస్తున్నారు. అది మాత్రమే కాకుండా సినిమాలో ఉపేంద్ర – సునీల్ శెట్టి లాంటి బిగ్ స్టార్స్ నటిస్తుండటంతో ప్రతిష్టాత్మకంగా మారింది. వరుణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సయిమంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

జనవరి 19న వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను విడుదల చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'గని' టైటిల్ మెగా అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. దీనికి కారణం 'బాలు' సినిమాలోని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాత్ర పేరు గని కావడమే. టైటిల్‌కు తగ్గట్టే వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ కూడా అదిరిపోయింది. మోషన్ పోస్టర్‌కు తమన్ నేపథ్య సంగీతం మరో ప్రధాన ఆకర్షణ. ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్న తమన్.. 'గని'కి కూడా అద్భుతమైన నేపథ్య సంగీతం అందించబోతున్నట్టు స్పష్టమవుతోంది.


Kranthi

Kranthi

Next Story