'భీమ్లానాయక్'​తో పోటీ నుంచి తప్పుకొన్న వరుణ్​తేజ్ 'గని'

Ghani Movie: మెగాప్రిన్స్ ​వరుణ్ తేజ్ నటించిన 'గని' చిత్రం మరోసారి వాయిదా పడింది.

Arun Chilukuri
Published on: 22 Feb 2022 8:07 PM IST
Varun Tej Ghani Movie Postponed Again
X

'భీమ్లానాయక్'​తో పోటీ నుంచి తప్పుకొన్న వరుణ్​తేజ్ 'గని'

Ghani Movie: మెగాప్రిన్స్ ​వరుణ్ తేజ్ నటించిన 'గని' చిత్రం మరోసారి వాయిదా పడింది. పవర్​స్టార్ ​పవన్ ​కల్యాణ్​ నటించిన భీమ్లా నాయక్'​తో పోటీ నుంచి తప్పుకొంది. ఫిబ్రవరి 25 లేదా మార్చి 4న సినిమాను విడుదల చేస్తామని గతంలో ప్రకటించిన 'గని' చిత్రబృందం ఫిబ్రవరి 25కే ఫిక్స్​అయ్యింది.

అయితే అదే తేదీన 'భీమ్లానాయక్​' రిలీజ్​ఉండటం వల్ల బాబాయి-అబ్బాయి మధ్య పోటీ తప్పదని విశ్లేషకులు భావించారు. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని 'గని' మేకర్స్​ తెలిపారు. ఈ సినిమాలో సయీ మంజ్రేకర్‌ కథానాయిక. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహించారు. అల్లు బాబీ, సిద్ధు ముద్ద సంయుక్తంగా నిర్మించారు.




Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story