Varun Tej New Movie: మరో దర్శకుడికి ఓకె చెప్పిన వరుణ్ తేజ్

Varun Tej New Movie: వరుస సినిమాలతో దూసుకుపోతున్న మెగా హీరో వరుణ్ తేజ్ మరో సినిమాకు ఓకె చెప్పినట్లు సమాచారం.

Kranthi
Updated on: 9 Jun 2021 12:29 PM IST
Varun Tej New Movie 2021 with Praveen Sattaru Director | Tollywood News Today
X

హీరో వరుణ్ తేజ్ (ఫోటో: ది హన్స్ ఇండియా)

Varun Tej New Movie 2021: వరుస సినిమాలతో దూసుకుపోతున్న మెగా హీరో వరుణ్ తేజ్ మరో సినిమాకు ఓకె చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన 'గని' సినిమా చేస్తున్నాడు .. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ షూటింగు జరుపుకుంది. అలాగే 'ఎఫ్ 3' సినిమాను కూడా చేస్తున్నాడు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కూడా త్వరలో మొదలుకానుంది.

'గరుడవేగ'తో మంచి హిట్‌ను అందుకున్న ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో వరుణ్‌ నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రవీణ్ సత్తారు చెప్పిన స్టోరీ లైన్‌ నచ్చి వరుణ్‌ వెంటనే ఆ ప్రాజెక్టును ఓకే చేశాడట. పవర్ పుల్ కథతో వస్తున్న ఈ సినిమా షూటింగ్.. కథ ప్రకారం మొత్తం లండన్‌లోనే జరుపుకోనుందట. కరోనా ఉదృతి కాస్తా తగ్గిన తర్వాత ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుందని తెలుస్తోంది.

భీష్మ మూవీ దర్శకుడు వెంకీ కుడుమలతో ఓ సినిమాకు అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కరోనా ఉదృతి కాస్తా తగ్గిన తర్వాత ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుందని తెలుస్తోంది. దీని గురించి పూర్తి సమాచారం త్వరలో వెల్లడికానుందని తెలుస్తోంది. తాజాగా దర్శకుడి పేరే నక్కిన త్రినాథరావు చెప్పిన కథ నచ్చడంతో వెంటనే వరుణ్ తేజ్ ఓకే చెప్పినట్లు టాలీవుడ్ టాక్. అయితే కొంతకాలంగా త్రినాథరావు .. రవితేజ హీరోగా ఒక సినిమా చేయనున్నాడని ప్రచారం జరిగింది. ప్రస్తుతం రవితేజ చేస్తున్న 'ఖిలాడి' తరువాత ఈ సినిమా ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ మధ్యలో రవితేజ .. శరత్ మండవ ప్రాజెక్టును పట్టాలెక్కించాడు. ఇప్పుడేమో వరుణ్ తేజ్ తో త్రినాథరావు సినిమా ఓకే అయిందని అంటున్నారు. ఈ సినిమాలకు సంబంధించి పూర్తి వివరాలను ఆయా చిత్ర యూనిట్లు తెలిజేయాల్సి వుంది.

Kranthi

Kranthi

Next Story