Varun Dhawan: సిటడెల్‌లో వరుణ్ సెమీ న్యూడ్ సీన్ పై నెటిజన్ జోక్.. స్పందించిన హీరో

Citadel Honey Bunny: సమంత, బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ జంటగా నటించిన వెబ్ సిరీస్ సిటడెల్ హనీబన్నీ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 8 Nov 2024 4:46 PM IST
Varun Dhawan Funny Reply To Netizen Over Semi Nude Scene In Citadel
X

Varun Dhawan: సిటడెల్‌లో వరుణ్ సెమీ న్యూడ్ సీన్ పై నెటిజన్ జోక్.. స్పందించిన హీరో

Citadel Honey Bunny: సమంత, బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ జంటగా నటించిన వెబ్ సిరీస్ సిటడెల్ హనీబన్నీ. ఈ మూవీకి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. స్పై థ్రిల్లర్ గా రూపొందిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అలా అందుబాటులోకి వచ్చిన ఈ సిరీస్‌ ప్రశంసలు అందుకుంటోంది. అయితే ఇందులో ఓ ఎపిసోడ్ లో వరుణ్ ధావన్ సెమీ న్యూడ్ లో కనిపించాడు. ఆ సన్నివేశంపై ఓ అభిమాని సరదాగా పోస్ట్ పెట్టారు. దీనికి ఆ హీరో కూడా అంతే హాస్యంగా రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరి పోస్టులు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి.

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ కు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓ ఎపిసోడ్‌లో వరుణ్ ధావన్ సెమీ న్యూడ్ సీన్ గురించి నెటిజన్ పోస్ట్ చేస్తూ.. ఇప్పటి వరకు సిటడెల్ లో మూడు ఎపిసోడ్‌లు చూశాను. చాలా బాగుంది. వరుణ్, సమంత ఇద్దరూ వారి యాక్షన్ తో అదరగొడుతున్నారు. కానీ వరుణ్ ను చూస్తే బాధగా ఉంది. ఎందుకంటే ప్రతి డైరెక్టర్ అతన్ని నగ్నంగా చూపిస్తున్నారు. అని కామెంట్ చేశారు. ఇక ఈ పోస్ట్ కు వరుణ్ రిప్లై ఇస్తూ.. ఈ మొత్తం సిరీస్ లో నేను ఎక్కువ శాతం పూర్తిగా డ్రెస్ వేసుకున్నాను. అది కూడా చూడండి అంటూ నవ్వుతున్న ఎమోజీలను జోడించాడు. ప్రస్తుతం ఈ పోస్టులు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ప్రస్తుతం ఈ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. బాలీవుడ్ నటీనటులు దీనిపై పోస్టులు పెడుతున్నారు. సమంత తన ఇన్ స్టా వేదికగా వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నారు. మరోవైపు వరుణ్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానుల పోస్టులకు రిప్లైలు పెడుతూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మయోసైటిస్ కారణంగా తాను ఈ వెబ్ సిరీస్ ను తిరస్కరించాలని అనుకున్నట్టు సమంత గతంలో చెప్పారు. ఆరోగ్యం సహకరించకపోయినా షూటింగ్ కు వెళ్లేవారని.. షూటింగ్ మొత్తం చాలా కష్టంగా గడిచిందని తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story