Varanasi Update: రాజమౌళి పక్కా ప్లాన్.. చెప్పిన సమయానికే మహేష్ వేట మొదలు!

Varanasi Update: రాజమౌళి పక్కా ప్లాన్.. చెప్పిన సమయానికే మహేష్ వేట మొదలు!
x
Highlights

మహేష్ బాబు - రాజమౌళి కాంబోలో రాబోతున్న 'వారణాసి' సినిమా 2027లోనే విడుదల కానుంది. రిలీజ్ విషయంలో ఎలాంటి వాయిదాలు ఉండవని చిత్ర బృందం స్పష్టం చేసింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు, అపజయమెరుగని దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ 'వారణాసి' (Varanasi) విడుదలపై చిత్ర యూనిట్ కీలక క్లారిటీ ఇచ్చింది. రాజమౌళి సినిమాలకు సంబంధించి సాధారణంగా ప్రచారంలో ఉండే 'వాయిదాల' వార్తలకు ఈసారి తావులేదని స్పష్టం చేస్తూ, రిలీజ్ ఇయర్‌ను రీ-కన్ఫర్మ్ చేసింది.

2027లో గ్లోబల్ రిలీజ్ ఖాయం!

గతంలో ప్రకటించినట్లుగానే, ఈ చిత్రాన్ని 2027లోనే ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు బుధవారం సామాజిక మాధ్యమాల వేదికగా 'వారణాసి' బృందం వెల్లడించింది. భారీ బడ్జెట్, అత్యున్నత సాంకేతిక విలువల కారణంగా షూటింగ్ ఆలస్యమవుతుందని వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ.. పనులు ప్రణాళిక ప్రకారం పక్కాగా సాగుతున్నట్లు సంకేతాలిచ్చింది.

రాజమౌళి స్టైల్ మారుతోంది?

సాధారణంగా రాజమౌళి సినిమాలు విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనుల వల్ల అనుకున్న సమయం కంటే ఆలస్యమవుతుంటాయి. కానీ, ఈ 'పాన్ వరల్డ్' ప్రాజెక్ట్ విషయంలో మాత్రం జక్కన్న చాలా పక్కాగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ స్థాయికి తగ్గట్టుగా భారీ హంగులతో తెరకెక్కుతున్నా, 2027 డెడ్‌లైన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేయకూడదని రాజమౌళి టీమ్ భావిస్తోంది.

సినిమా విశేషాలు:

తారాగణం: మహేష్ బాబు హీరోగా నటిస్తుండగా, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కథానాయికగా అలరించనుంది. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

నిర్మాణం: కె.ఎల్. నారాయణ మరియు ఎస్.ఎస్. కార్తికేయ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories