Varalaxmi Sarathkumar: జయమ్మకు డిమాండ్ పెరిగింది

Varalaxmi Sarathkumar: రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ సినిమాలో జయమ్మగా అదరగొట్టిన నటి వరలక్ష్మి.

Kranthi
Published on: 1 July 2021 8:33 AM IST
Varalaxmi Sarathkumar to do a Keyrole in Prashanth Varma Hanuman
X

Varalakshmi Sarath Kumar:(Instagram)

Varalaxmi Sarathkumar: జయమ్మ.. ఇప్పుడు ఈ పేరు టాలీవుడ్ లో ఫేమస్. ఆ పాత్ర అంత గుర్తుండిపోయేలా చేసింది నటి వరలక్ష్మి. అవటానికి తమిళియన్ అయినా.. టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. బ్యూటీకి బ్యూటీ.. యాక్షన్ కి యాక్షన్.. క్యారెక్టర్ ఏదైనా సరే.. అదరగొట్టేస్తుందీ వరమ్మ. అందుకే ఇప్పుడు వరలక్ష్మిని సినిమాలో పెట్టుకోవడానికి ఓ క్యారెక్టర్ ను అదనంగా క్రియేట్ చేసుకుని మరీ కథలు రాసుకుంటున్నారంట.

రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ సినిమాలో జయమ్మగా అదరగొట్టిన నటి వరలక్ష్మి. ఆమె ప్రముఖ తమిళ తెలుగు నటుడు శరత్ కుమార్ కూతురు. వరలక్ష్మి తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ సినిమాల్లో అడుగుపెట్టి ఆమె కంటూ సొంత ఐడెంటిటీ ఏర్పరుచుకున్నారు క ఇటీవల అల్లరి నరేష్ నాందిలో కూడా నటించి మరో విజయాన్ని అందుకుంది. కాగా తాజాగా వస్తున్న సమాచారం మేరకు వరలక్ష్మి తెలుగులో మరో అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

జాంబి రెడ్డి తర్వాత ప్రశాంత్ వర్మ హను మాన్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరలక్ష్మి కీలకపాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. ఇక్కడ మరో విషయం ఏమంటే వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ nbk 107 లో కూడా కీలకపాత్రలో కనిపించనుందట. ఈ సినిమాకు గోపీచంద్ దర్శకుడు. బాలయ్య హీరోగా చేస్తున్నారు. మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది.

Kranthi

Kranthi

Next Story