Balakrishna: బాలకృష్ణ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్?

Balakrishna: సౌత్ లో ప్రతిభావంతులైన నటులలో వరలక్ష్మి శరత్‌కుమార్ ఒకరు. టాలీవుడ్‌లోకి తన నటనతో బాగానే ఆకట్టుకుంటుంది.

Venkata Chari
Updated on: 7 Jun 2021 10:46 PM IST
Varalakshmi Sarathkumar in NBKs next?
X

వరలక్ష్మి శరత్‌కుమార్, బాలకృష్ణ

Balakrishna: సౌత్ లో ప్రతిభావంతులైన నటులలో వరలక్ష్మి శరత్‌కుమార్ ఒకరు. టాలీవుడ్‌లోకి తన నటనతో బాగానే ఆకట్టుకుంటుంది. ఇప్పటికే, తెలుగులో క్రాక్, నాంది అనే రెండు హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం బాలయ్య సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

తాజా నివేదికల మేరకు బాలకృష్ణ తదుపరి సినిమాలో నటించేందుకు వరలక్ష్మి శరత్‌కుమార్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో బాలకృష్ణ ఓ సినమాలో నటించేందుకు రంగం సిద్ధమైంది. ఈ సినిమాలోనే వరలక్ష్మి శరత్‌కుమార్‌ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలెక్కనుంది. ఈ సినిమాలో ఈ నటి కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాలలో ఈ నటి చాలా బిజీగా ఉంది. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 10 న కొత్త ప్రాజెక్ట్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు త్వరలో బయటకు రానున్నాయి.

Venkata Chari

Venkata Chari

Next Story