Vamshi Paidipally: విజయ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న వంశీ పైడిపల్లి

Vamshi Paidipally: విజయ్ సినిమా పై అప్డేట్లు అప్పటి నుంచి విడుదల చేస్తామంటున్న వంశీపైడిపల్లి

admin1
Updated on: 2 Nov 2021 5:37 PM IST
Vamsi Paidipally Praises on Kollywood Hero Vijay
X
డిసెంబర్ నుండి సినిమా అప్ డేట్లు ఇష్టం అంటున్న వంశీ పైడిపల్లి (ఫైల్ ఇమేజ్)

Vamshi Paidipally: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇప్పుడు ఒక డైరెక్ట్ తెలుగు సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. "మహర్షి" డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు వంశీ. ఈ సినిమాలో ఎమోషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. "హ్యూమన్ రిలేషన్ షిప్స్ మరియు ఎమోషన్స్ నా బలం. ఇప్పుడు విజయ్ సర్ తో నేను తీయబోయే సినిమాలు రెండు ఎక్కువగానే ఉంటాయి. అలాగే నేను కథను కూడా విజయ్ సర్ కి ఉన్న ఫ్యాన్ బేస్ ను దృష్టిలో పెట్టుకుని రాశాను" అని అన్నారు వంశీ.

ఇక సినిమాకి సంబంధించిన అప్డేట్లు డిసెంబర్ నుంచి విడుదల చేస్తామని చెప్పిన వంశీ పైడిపల్లి ఇప్పటికే స్క్రిప్ట్ ఫైనలైజ్ అయిపోయిందని, ఈ యేడాది ఆఖర్లో సినిమాకి సంబంధించిన విషయాలను వెల్లడిస్తామని అన్నారు. ఇక విజయ్ సింప్లిసిటీ గురించి మాట్లాడుతూ "తమిళ సినిమాలో ఆయన చాలా ఎంతో ఎత్తుకి ఎదిగారు కానీ చాలా వినయంగా వుంటారు. ఆయన ఏదైనా సినిమా మొదలు పెట్టాలంటే ముందు డైరెక్టర్ నుండి ఎలాంటి వైబ్స్ వస్తున్నాయని గమనిస్తారు. ఆయనకి అబ్జర్వేషన్ చాలా ఎక్కువ" అని చెబుతూ విజయ్ పై ప్రశంసల వర్షం కురిపించారు వంశి.

admin1

admin1

Next Story