దిల్ రాజు ప్లాన్స్ కి అడ్డుకట్ట వేసిన వంశీ పైడిపల్లి

Dil Raju: తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిత్ర డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఇలా అన్నారు

R Tripura Malini
Published on: 27 Oct 2022 1:11 PM IST
Vamsi Paidipalli Gave A Big Shock To Dil Raju
X

దిల్ రాజు ప్లాన్స్ కి అడ్డుకట్ట వేసిన వంశీ పైడిపల్లి

Varasudu: ప్రముఖ కోలీవుడ్ హీరో విజయ్ తాజాగా ఇప్పుడు టాలీవుడ్ లో కూడా అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటి దాకా చాలానే విజయ్ సినిమాలు తెలుగులో డబ్ అయ్యి మంచి హిట్ అయ్యాయి. తాజాగా ఇప్పుడు విజయ్ డైరెక్ట్ గా ఒక తెలుగు తమిళ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. అదే "వారసుడు". వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

అయితే సినిమా ప్రకటించినప్పటి నుంచి ఇది ఒక బై లింగువల్ సినిమా అని, తెలుగు తమిళ్ రెండు భాషల్లోనూ విడుదల అవుతుంది అని సినిమాని భారీ స్థాయిలో ప్రమోట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు దిల్ రాజు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిత్ర డైరెక్టర్ వంశీ పైడిపల్లి మాత్రం దిల్ రాజు ప్లాన్లకు అడ్డుకట్ట వేసినట్లు అయింది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వంశీ పైడిపల్లి "వారసుడు" ఒక ప్రాపర్ తమిళ్ సినిమా అని అన్నారు.

నిజానికి బైలింగువల్ సినిమా టాక్ ను ఉపయోగిస్తూ దిల్ రాజు ఈ సినిమాని భారీ స్థాయిలో బోరడు స్క్రీన్లతో విడుదల చేయాలని అనుకున్నారు కానీ ఇప్పుడు వంశీ పైడిపల్లి వచ్చి వారసుడు సినిమా ఒక తమిళ్ సినిమా అని అనడం తో దిల్ రాజు ప్లాన్ ఫ్లాప్ అయింది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, కుష్బూ, జయసుధ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story