మహేష్ కి చెప్పిన కథనే ఎన్టీఆర్ తో చేస్తే..

Vamshi Paidipally Tells Brindavanam Story to Mahesh Babu
x

మహేష్ కి చెప్పిన కథనే ఎన్టీఆర్ తో చేస్తే..

Highlights

Brindavanam: బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న "అన్‌స్టాపబుల్" ఆఖరి ఎపిసోడ్ కి మహేష్ బాబు గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే.

Brindavanam: బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న "అన్‌స్టాపబుల్" ఆఖరి ఎపిసోడ్ కి మహేష్ బాబు గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. "మహర్షి" సినిమా డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా మహేష్ బాబుతో కలిసి బాలయ్య తో ముచ్చటించారు. షో లో మాట్లాడుతూ మహేష్ బాబు కి ఒక కథ చెప్పాను కానీ అది వర్కౌట్ అవ్వలేదని, సెట్స్పైకి వెళ్లలేదు అని అన్నారు వంశీ. అయితే వంశీ పైడిపల్లి మహేష్ బాబు కి చెప్పిన ఆ కథ బృందావనం అని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఎన్టీఆర్ హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్లో వచ్చిన "బృందావనం" సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 32 కోట్ల షేర్ కలెక్షన్లు నమోదు చేసుకుంది. కాజల్ మరియు సమంత ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. అప్పటిదాకా మాస్ సినిమాలతో అలరించిన ఎన్టీఆర్ ఈ సినిమాలో తన క్లాస్ లుక్ తో అందరి దృష్టిని ఆకర్షించారు. థమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ గా నిలిచింది. మరి మహేష్ బాబు బృందావనం సినిమాలో నటించి ఉంటే ఎలా ఉండేదో అని అభిమానులు అనుకుంటున్నారు. మరో వైపు మహేష్ బాబు హీరోగా నటించిన "సర్కారు వారి పాట" సినిమా మే 11న విడుదలకు సిద్ధమవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories