మహేష్ బాబు కోసం నిర్మాతగా మారిన వంశీ పైడిపల్లి

*మహేష్ బాబు కోసం నిర్మాతగా మారిన వంశీ పైడిపల్లి

admin1
Updated on: 30 March 2022 7:00 PM IST
Vamshi Paidipally Producing the Mahesh Babu Film | Tollywood News
X

మహేష్ బాబు కోసం నిర్మాతగా మారిన వంశీ పైడిపల్లి

Mahesh Babu Film: "మహర్షి" సినిమా తర్వాత వంశీ పైడిపల్లి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా మంచి స్నేహితులు అయిపోయారు. ఇరు కుటుంబాల మధ్య కూడా మంచి బంధం ఏర్పడింది. అయితే మహర్షి సినిమా కమర్షియల్గా మంచి హిట్ అయినప్పటికీ అభిమానులు మాత్రం సినిమా విషయంలో కొంచెం నిరాశ చెందారని చెప్పుకోవాలి. ఇక త్వరలోనే మహేష్ బాబు మరియు వంశీ పైడిపల్లి కాంబినేషన్లో మరో సినిమా రాబోతోంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో పట్టాలు ఎక్కాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. కానీ త్వరలోనే వంశీ పైడిపల్లి మహేష్ బాబు సినిమా తో బిజీ కాబోతున్నట్లు తెలుస్తోంది.

సర్కారు వారి పాట సినిమా విడుదలైన తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో #SSMB28 షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం వంశీ పైడిపల్లి కూడా ఈ సినిమాతో మహేష్ బాబు తో చేతులు కలపనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి డైరెక్టర్ గా కాకుండా నిర్మాతగా మహేష్ బాబు సినిమా లో భాగం కాబోతున్నారు వంశీ పైడిపల్లి. శ్రీకర స్టూడియోస్ వారితో సంయుక్తంగా వంశీపైడిపల్లి ఈ సినిమాని నిర్మించనున్నారు.

admin1

admin1

Next Story