Vamshi Paidipally: సూపర్ స్టార్ తో సినిమా ప్లాన్ చేస్తున్న వంశీ పైడిపల్లి

Vamshi Paidipally: రజనీకాంత్ తో సినిమా ప్లాన్ చేస్తున్న మహేష్ బాబు డైరెక్టర్

Dhatripriya
Published on: 12 April 2023 1:05 PM IST
Vamshi Paidipally Is Planning Film With Superstar
X

Vamshi Paidipally: సూపర్ స్టార్ తో సినిమా ప్లాన్ చేస్తున్న వంశీ పైడిపల్లి

Vamshi Paidipally: ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి తాజాగా ఇప్పుడు సౌత్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి ఒక సినిమా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్ర స్క్రిప్ట్ పూర్తయిన తర్వాత దిల్ రాజు మరియు వంశీ పైడిపల్లి ఒకసారి రజనీకాంత్‌ ని కలవాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుగుతోంది.

మరి "మహర్షి" సినిమాతో కేవలం కొంతమందిని మాత్రమే అలరించగలిగిన వంశీ పైడిపల్లి సూపర్‌స్టార్ రజనీకాంత్‌ ను తన స్క్రిప్ట్ తో మెప్పించగలడా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు దిల్ రాజు మరియు వంశీ పైడిపల్లి కాంబో లో ఈ మధ్యనే ఇళయ తలపతి విజయ్‌ హీరోగా "వారీసు" కోసం పనిచేసిన తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అసలైతే వంశీ మరియు విజయ్ కాంబో మళ్లీ రిపీట్ అవ్వబోతుందని గతంలో వార్తలు వచ్చాయి. కానీ అట్లీ మరియు విజయ్ కాంబో లో ఇప్పుడు సినిమా ఖరారు అయ్యింది. దాంతో వంశీ పైడిపల్లి ఇప్పుడు రజనీకాంత్ తో సినిమా మీద దృష్టి పెడుతున్నారు. మరోవైపు దిల్ రాజు మిగతా భాషలలో తన సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

జెర్సీ, హిట్ వంటి తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమాలను బాలీవుడ్ లో రీమేక్‌ చేస్తున్నారు దిల్ రాజు. కానీ ఆ సినిమాలతో పరాజయం పాలైన సంగతి కూడా తెలిసిందే. దీంతో మళ్లీ తెలుగు సినిమాలపైనే దృష్టి పెట్టిన దిల్ రాజు రజనీకాంత్‌ సినిమా పై దృష్టి పెట్టారు. ప్రస్తుతం రజనీకాంత్ "జైలర్" షూటింగ్ పూర్తి చేశాక వంశీ తో సినిమా మొదలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Dhatripriya

Dhatripriya

Next Story