Vamshi Paidipally: ట్రోలర్లకు గట్టి రిప్లై ఇచ్చిన వంశీ పైడిపల్లి

* ట్రోలర్ల పై రివర్స్ లో విరుచుకుపడిన వంశీ పైడిపల్లి

Dhatripriya
Updated on: 18 Jan 2023 5:30 PM IST
Vamshi Paidipally Gave A Strong Reply To The Trollers
X

ట్రోలర్లకు గట్టి రిప్లై ఇచ్చిన వంశీ పైడిపల్లి

Vamshi Paidipally: మహేష్ బాబు హీరోగా నటించిన "మహర్షి" సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న వంశీ పైడిపల్లి తాజాగా ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో "వారీసు" అనే సినిమాని తీశారు. ఇదే సినిమా తెలుగులో "వారసుడు" అనే టైటిల్ తో సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. సినిమా చాలా రొటీన్ గా ఉందని, కథలో ఏమాత్రం కొత్తదనం లేదని ప్రేక్షకులు వంశీ పైడిపల్లి పై మండిపడ్డారు.

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనపై వస్తున్న ట్రోలింగ్ గురించి తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు వంశీ పైడిపల్లి. సినిమా తీయడం అంటే జోక్ కాదని చిత్ర బృందం ఒక సినిమా కోసం ఎంతో కష్టపడుతుందని ఒక సినిమా తీయడానికి ఫిలిం మేకర్లు ఎన్నో త్యాగాలు చేయాల్సి వస్తుందని అన్నారు వంశీ పైడిపల్లి. ఎంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ విజయ్ కూడా సినిమా కోసం చాలా కష్టపడతారని ప్రతి సాంగ్ మరియు ప్రతి డైలాగ్ ను సెట్స్ మీదకి రాకముందే చాలా రిహార్సల్స్ చేస్తారని అన్నారు వంశీ.

అయితే ఈ సినిమా సీరియల్ లాగా ఉంది అని చాలామంది కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. దీని గురించి రియాక్ట్ అవుతూ "సీరియల్స్ లో తప్పేముంటుంది అన్నీ వర్గాల కుటుంబాలు సీరియల్స్ ని ప్రేమిస్తారు, రోజు చూస్తారు. సీరియల్స్ ను ఏదో తక్కువ చేసి కొట్టి పారేయకూడదు," అని అన్నారు వంశీ పైడిపల్లి. అయితే మరోవైపు నెటిజన్లు మాత్రం ఒక డైరెక్టర్ అన్నాక ప్రశంసలతో పాటు కొంత నెగిటివిటీ కూడా వస్తుందని దానికి వంశీ పైడిపల్లి అంత రూడ్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు అని అంటున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story