Valimai Movie: భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తున్న "వాలిమై"

Valimai Movie: భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తున్న "వాలిమై"

admin1
Updated on: 14 Feb 2022 10:00 PM IST
Valimai Movie Doing Huge Pre-Release Business | Tollywood News
X

భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తున్న "వాలిమై"

Valimai Movie: తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కాలీవుడ్ స్టార్ హీరోలలో అజిత్ కూడా ఒకరు. అజిత్ నటించిన సినిమాలు తెలుగులో కూడా డబ్బింగ్ చేసి విడుదల అవుతుంటాయి. ఈ నేపథ్యంలోనే అజిత్ హీరోగా నటిస్తున్న తమిళ సినిమా "వాలిమై" కూడా తెలుగులో "వలిమై" అనే టైటిల్ తో విడుదల కాబోతోంది. రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ తరపున వెంకట్ తెలుగులో నాలుగు కోట్ల చెల్లించి తెలుగు రైట్స్ ను సొంతం చేసుకున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో అజిత్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. తమిళ్ లో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర తమిళనాడు రైట్స్ 72 కోట్ల కి అమ్ముడయినట్లు తెలుస్తోంది. మధురై నుంచి గోపురం ఫిలిమ్స్ అనే బ్యానర్ ఈ చిత్రం తమిళనాడు రైట్స్ ని సొంతం చేసుకుంది. కరోనా తర్వాత ఇంత భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమా ఇదే. తెలుగు, తమిళంలో మాత్రమే కాక హిందీ లో కూడా ఈ సినిమాకి మంచి ఆదరణ ఉన్నట్లు తెలుస్తోంది. హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కార్తికేయ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. హ్యూమా ఖురేషి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. బోనీ కపూర్ నిర్మించిన ఈ సినిమా ఈనెల 24వ తారీఖు న విడుదలకు సిద్ధమవుతోంది.

admin1

admin1

Next Story