Nithiin: వక్కంతం వంశీతో నితిన్ సినిమా!

Vakkantham Vamsi to Direct Nithiin Movie
x

క్కంతం వంశీ,  నితిన్ (ఫొటో ట్విట్టర్)

Highlights

నితిన్‌ ఈ ఏడాదిలో ‘చెక్‌’, ‘రంగ్‌ దే’ సినిమాలను విడుదల చేశాడు. కానీ, రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి.

Nithiin: యంగ్ హీరో నితిన్‌ ఈ ఏడాదిలో 'చెక్‌', 'రంగ్‌ దే' సినిమాలను విడుదల చేశాడు. కానీ, రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి. ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రానున్న 'మ్యాస్ట్రో' చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు నితిన్. ఇకపై ఎంచుకునే సినిమాలపై స్పెషల్ ఫోకస్ పెట్టాడు ఈ యంగ్ హీరో.

'నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా' ఫేం వక్కంతం వంశీతో ఓ సినిమా చేసేందుకు నితిన్‌ ఓకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని ఠాగూర్‌ మధు నిర్మించనున్నారని సమాచారం. ఆగస్టులో సినిమా పట్టాలపైకి వెళ్లనున్నట్లు సమాచారం. ''రొమాంటిక్‌ కామెడీ తోపాటు హై వోల్టేజ్‌ యాక్షన్‌ డ్రామా బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా రానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నితిన్‌ పాత్ర స్పెషల్‌ గా ఉండనున్నట్లు వార్తలొస్తున్నాయి.

కాగా, ఈ సినిమా ఇతర నటీనటులు, సిబ్బందిని కరోనా పరిస్థితులు ఓ కొలిక్కి వచ్చాక వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. అలాగే నితిన్‌ 'పవర్‌ పేట' అనే మరో సినిమాను చేయబోతున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories