Vakeel Saab​​​ Movie: 'మగువా.. మగువా' వీడియో సాంగ్‌ వచ్చేసింది

Vakeel Saab​​​ Movie: మూడేళ్ల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'వకీల్ సాబ్'.

Samba Siva Rao
Published on: 30 April 2021 5:28 PM IST
Maguva Maguva
X
వకీల్  సాబ్ 

Vakeel Saab​​​ Movie: మూడేళ్ల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'వకీల్ సాబ్'. ఈ మూవీ ఏప్రీల్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. 'వకీల్ సాబ్' హిందీ సినిమా పింక్‌కు తెలుగు రీమేక్‌ అన్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయినా ఈ సినిమాకు ఓపెనింగ్స్ అదిరిపోయే రేంజ్‌లో వచ్చాయి. కొన్ని చోట్ల బెనిఫిట్ షోలకు అడ్డంకులు వచ్చినా.. కలెక్షన్స్‌ భారీగానే వచ్చాయి. పవర్ స్టార్ సినిమాకు మొదటి వీకెండ్ లో వచ్చిన కలెక్షన్స్ తర్వాత తగ్గిపోయాయి. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆల్రెడీ థియేటర్స్ మూతపడ్డాయి.

ఈ నేపథ్యంలో అనుకున్న తేదీకి కంటే ముందే వకీల్ సాబ్ ఓటీటీ బాట పట్టింది. ఏప్రిల్ 30న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయింది. సినిమా విడుదల అయిన 20 రోజులకే అమెజాన్ లో వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ముఖ్యమైన సాంగ్ 'మగువా.. మగువా'ఈ పాట వీడియో విడుదల అయింది. సినిమా విడుదలకు ముందు ఈ పాట ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్‌ అందించగా., మోహన భోగరాజు ఆలపించారు. థమన్‌ సంగీతం అందించారు.

వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్‌, అనన్య, ప్రకాశ్ రాజ్‌ కీలక పాత్రలు పోషించారు. శృతి హాసన్ ఓ చిన్న పాత్రలో మెరిసింది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ పాటను ఓ సారి మీరు కూడా చూడండి.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story