Vakeel Saab: ఓటీటీలోనూ సత్తా చాటుతోన్న వకీల్ సాబ్

Vakeel Sab Movie Creates Records in ott
x

vakeel saab:(File Image) 

Highlights

Vakeel Saab: థియేటర్లో తన వాదన వినని వారికోసం నేరుగా ఓవర్‌ ద టాప్‌లో వచ్చేసాడు వకీల్ సాబ్.

vakeel saab: హిందీ సినిమా పింక్‌కు తెలుగు రీమేక్‌గా వచ్చిన వకీల్ సాబ్ మూవీ ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా రావడంతో ఈ సినిమాకు ఓపెనింగ్స్ అదిరిపోయే రేంజ్‌లో వచ్చాయి. ముఖ్యంగా కోవిడ్ సమయంలో కూడా ఈ రేంజ్‌లో వసూళ్లు అంటే మాటలు కాదు. ముఖ్యంగా మొదటి మూడు రోజులు అదిరిపోయే కలెక్షన్స్‌ వచ్చాయి. ఇక ఇప్పుడు వకీల్ సాబ్ ఓటీటీలో సందడి చేస్తున్నాడు. థియేటర్లో తన వాదన వినని వారికోసం నేరుగా ఓవర్‌ ద టాప్‌లో వచ్చేసాడు వకీల్ సాబ్. ఎస్‌ వకీల్‌ సాబ్‌ మూవీ ఏప్రిల్ చివరివారం నుంచి ఓటీటీలో స్ట్రీమ్‌ అవుతుంది. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్ గ్రాండ్‌ కమ్‌ బ్యాక్‌ మూవీ వకీల్ సాబ్‌.. అమెజాన్‌ ప్రైమ్‌లో.. ఏప్రిల్ 30నుంచి స్ట్రీమ్‌ అవుతుంది.

ఈ సినిమాకు థమన్ సంగీతం అందించగా అనన్య నాగల్ల, నివేతా థామస్, అంజలిలు కీలక పాత్రల్లో నటించారు. శృతి హాసన్ ఓ చిన్న పాత్రలో మెరిసింది. మరో కీలకపాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించారు. దిల్ రాజ్‌ ప్రొడ్యూస్‌ చేసిన ఈ సినిమా హౌస్‌ ఫుల్ కలెక్షన్‌లతో రన్‌ అయి.. అదిరిపోయే రికార్డులను క్రియేట్ చేసింది. ఇప్పుడు ఓటీటీలోనూ అదే దూకుడు ప్రదర్శిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories