వకీల్‌సాబ్ టీజర్ విడుదల: రిలీజైన కొన్ని నిమిషాల్లోనే దిమ్మతిరిగే వ్యూస్

X
Highlights
రాజకీయాల వల్ల కొన్ని రోజులు సినిమాలకి దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు....
Arun Chilukuri14 Jan 2021 1:01 PM GMT
రాజకీయాల వల్ల కొన్ని రోజులు సినిమాలకి దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. అందులో భాగంగానే పవన్ రీఎంట్రీ మూవీగా `వకీల్‌సాబ్` తెరకెక్కుతుంది. ఈ సినిమాకి ఓ మై ఫ్రెండ్ ఫేం వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, బోనీ కపూర్, దిల్ రాజు కలిసి సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి పండగను పురస్కరించుకుని ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. కోర్టులో వాదించటమూ తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు అంటూ పవన్ చెప్పిన డైలాగ్ అలరిస్తోంది. ఇప్పుడు విడుదలైన 'వకీల్‌సాబ్' టీజర్‌తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న వకీల్‌సాబ్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Web Titlevakeel Saab teaser released
Next Story