Vakeel Saab Teaser : పవన్ అభిమానులకు గుడ్ న్యూస్.. 'వకీల్ సాబ్' టీజర్ ముహూర్తం ఫిక్స్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధానపాత్రలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'వకీల్ సాబ్ '.

Samba Siva Rao
Updated on: 7 Jan 2021 7:56 PM IST
Vakeel Saab Teaser : పవన్ అభిమానులకు గుడ్ న్యూస్.. వకీల్ సాబ్ టీజర్ ముహూర్తం ఫిక్స్
X

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధానపాత్రలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'వకీల్ సాబ్ '. అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రతి అప్ డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలో 'వకీల్ సాబ్' సినిమా యూనిట్ పవర్ స్టార్ అభిమానులకు సంక్రాంతి కానుక ఇవ్వదలిచింది. జనవరి 14 సంక్రాంతి సందర్భంగా సాయంత్రం 6.03 గంటలకు 'వకీల్ సాబ్' టీజర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కాగా.. ఈ దీనికి సంబంధించిన పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. పవన్ అభిమానులు టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు.

న్యూ ఇయర్ ముందు రోజు డిసెంబర్ 31న ఈ సినిమాకు సంబంధించి ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో పవన్ రాయల్ ఎన్ ఫీల్డ్ లేటెస్ట్ మోడల్ బుల్లెట్ నడుపుతుండగా... వెనుక శృతిహాసన్ నవ్వుతూ కనిపించింది. తాజా పోస్టర్ చూస్తుంటే పవన్, శృతిహాసన్ మధ్య రోమాన్స్ సీన్లు ఉంటాయని తెలుస్తోంది. మరోసారి ఈ జోడీ ప్రేక్షకులను అలరించనుందని తెలుస్తోంది.

ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్, అనన్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ స్వరాలు అందిస్తున్నాడు. ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమా విడుదలపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుంది. 'పింక్' చిత్రాన్ని 'వకీల్ సాబ్' పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అజ్ఞాతవాసి సినిమా తర్వత వస్తున్న వకీల్ సాబ్ పై పవన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా 100 కోట్లకు పైగానే జరుగుతుంది. పవన్ రీ ఎంట్రీ సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story