Vakeel Saab : పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ?

Vakeel Saab : అజ్ఞాతవాసి సినిమా తర్వాత రెండు ఏళ్ళు విరామం తీసుకున్న పవన్ కళ్యాణ్ మళ్ళీ వరుసపెట్టి సినిమాలను చేస్తున్నాడు..\

Krishna
Published on: 29 Aug 2020 6:37 PM IST
Vakeel Saab : పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ?
X

Vakeel Saab 

Vakeel Saab : అజ్ఞాతవాసి సినిమా తర్వాత రెండు ఏళ్ళు విరామం తీసుకున్న పవన్ కళ్యాణ్ మళ్ళీ వరుసపెట్టి సినిమాలను చేస్తున్నాడు.. ఇప్పటికే మూడు సినిమాలను కమిట్ అయ్యాడు పవన్.. అందులో భాగంగా అయన రీఎంట్రీ మూవీగా వకీల్ సాబ్ తెరకెక్కుతుంది.ఇది పవన్ కి 26 వ చిత్రం కావడం విశేషం.. హిందీలో వచ్చిన పింక్ సినిమాకి ఇది రీమేక్ ..ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటుగా అంజలి, నివేతా థామస్, అనన్య పాండే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకి ఓ మై ఫ్రెండ్ ఫేం వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, బోనీ క‌పూర్‌, దిల్ రాజు కలిసి సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.. కరోనా వైరస్ ప్రభావం వలన సినిమా షూటింగ్ ప్రస్తుతానికి వాయిదా పడింది.

ఇప్పటికే సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయి సినిమా పైన బాగా క్రేజ్ ని సంపాదించాయి.. ఇక పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు (సెప్టెంబర్ 2) సందర్భంగా సినిమాకి సంబంధించిన మరో లుక్ తో పాటుగా మోషన్ పోస్టర్ ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.. ఇక ఇది ఇలా ఉంటే అటు ట్విట్టర్ లో ఇప్పటికే పవన్ పుట్టినరోజు వేడుకలు మొదలయిపోయాయి.

ఈ సినిమా తర్వాత క్రిష్ డైరెక్షన్లో ఓ సినిమాని పవన్ లైన్ లో పెట్టారు. ఎఎం రత్నం ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక దీని తర్వాత పవన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇక పూరి, త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు పవన్ సిద్దం అయ్యారని తెలుస్తోంది.

Krishna

Krishna

Next Story