Vakeel Saab: 'సత్యమేవ జయతే' అంటూ మెగా ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్

Venkata Chari
Published on: 2 March 2021 5:45 PM IST
Vakeel Saab Special Treat For Mega Fans From Pavan Kalyan
X

Pavan Kalyan's Vakeel Saab (ఫోటో ట్విట్టర్)

Vakeel Saab: 'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత వెండితెరకు దూరమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరిగి ఇటీవలే కెమెరా ముందుకొచ్చారు. వరుస సినిమాలతో జోరు పెంచుతూ మూవీ అప్ డేట్స్ తో అభిమానులను సర్ ప్రైజ్ చేస్తున్నారు. దీంతో ఎప్పుడెప్పుడు పవన్‌ని థియేటర్స్‌లో చూస్తామని ఆతృతగా వెయిట్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. తన రీ- ఎంట్రీ మూవీ 'వకీల్ సాబ్' షూటింగ్ పూర్తి చేశారు పవన్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్‌, టీజర్‌, మగువ మగువ సాంగ్ భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. తాజాగా వకీల్ సాబ్ సినిమా నుంచి 2వ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్.

వకీల్ సాబ్ మూవీ నుంచి రెండో సాంగ్ 'సత్యమేవ జయతే...' లిరికల్ పాటను మార్చి 3వ తేదీ సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ పోస్టర్‌లో పవర్ స్టార్ లుక్ అట్రాక్ట్ చేస్తోందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తున్నారు. లాయర్ గెటప్‌లో కోటు ధరించి పవన్ కళ్యాణ్ కనిపిస్తుండగా.. ఆయన వెనుక మహాత్మ గాంధీ ఫొటో ఉంది.

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'పింక్' తెలుగు రీమేక్‌గా తీసుకొస్తున్నారు డైరెక్టర్ వేణు శ్రీరామ్. పవన్ ఇమేజ్‌, తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా చాలా మార్పులు చేశారట. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ సినిమాలో పవర్ స్టార్ సరసన అంజలి, నివేత థామస్, అనన్య నాగేళ్ల హీరోయిన్లుగా నటిస్తున్నారు. శృతి హాసన్ ముఖ్యపాత్ర పోషిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 9న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.


Venkata Chari

Venkata Chari

Next Story