Vakeel Saab: 'కంటిపాప' సాంగ్ రిలీజ్

Vakeel Saab: పవర్‌స్టార్‌ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘వకీల్‌సాబ్’ నుంచి మరో సాంగ్ రిలీజైంది‌.

Venkata Chari
Published on: 17 March 2021 7:20 PM IST
Vakeel Saab Song Kanti Papa Released
X

వకీల్ సాబ్ సినిమాలోని కంటిపాప సాంగ్ (ఫొటో యూట్యూబ్)

Vakeel Saab: పవర్‌స్టార్‌ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 'వకీల్‌సాబ్' నుంచి మరో సాంగ్ రిలీజైంది‌. ఇప్పటికే ఈ సినిమాలో విడుదలైన రెండు పాటలు సూపర్‌ హిట్‌గా ట్రెండ్ అవుతున్నాయి. ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌ తమన్‌ సంగీతం అందించారు. తాజాగా ఈ చిత్రం​ నుంచి కంటి పాప..కంటి పాప అనే పాట రిలీజ్ అయింది. ఈ పాటను రామ జోగయ్యశాస్ర్తి రచించగా, బాలీవుడ్‌ సింగర్‌ అర్మాన్‌ మాలిక్‌ పాడారు. సాంగ్‌ రిలీజ్‌ అయిన కాసేపట్లోనే వేలసంఖ్యలో వ్యూస్‌ వచ్చాయి.

కాగా, బాలీవుడ్‌లో హిట్‌ సాధించిన పింక్‌ చిత్రాన్ని తెలుగులో వకీల్‌సాబ్‌గా రీమేక్‌గా చేస్తున్నారు. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పింక్'లో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను 'వకీల్ సాబ్'లో పవన్ కళ్యాణ్ పోషిస్తుండడంతో భారీ హైప్ క్రియెట్‌ అయ్యింది. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ విడుదల కానుంది. శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


Venkata Chari

Venkata Chari

Next Story