Vakeel Saab: 'వకీల్ సాబ్'కి కొత్త టెన్షన్..ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై ఉత్కంఠ‌

Vakeel Saab: పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్‌ పేరు చెబితేనే ఫ్యాన్స్‌ ఊగిపోతారు. అలాంటిది ఆయనను నేరుగా చూసే అవకాశం వస్తే దానిని అస్సలు వదులుకోరు.

Arun Chilukuri
Published on: 3 April 2021 8:07 PM IST
All set for Vakeel Saab Pre-release Event in Shilpakala Vedika
X

Vakeel Saab: ఫ్యాన్స్‌లో టెన్షన్‌.. టెన్షన్‌..

Vakeel Saab: పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్‌ పేరు చెబితేనే ఫ్యాన్స్‌ ఊగిపోతారు. అలాంటిది ఆయనను నేరుగా చూసే అవకాశం వస్తే దానిని అస్సలు వదులుకోరు. రాష్ట్రాలు, జిల్లాలు దాటేసి మరీ భారీగా తరలివస్తారు. ఇప్పుడు ఇదే వకీల్‌ సాబ్‌ చిత్ర యూనిట్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్ తాజాగా నటించిన చిత్రం వకీల్‌ సాబ్‌. ఈ సినిమా ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకు పవన్‌ నటించిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ సినిమా మరో ఎత్తు. ఇప్పటికే రిలీజ్‌ అయిన ట్రైలర్‌ సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది.

ఇక సినిమాకు ముందు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ అంటూ ఒకటుంటుంది కదా. ఇప్పుడు ఇదే చిత్ర బృందానికి పెద్ద తలనొప్పిగా మారింది. యాక్చువల్‌గా ఒక స్టేడియంలో భారీ లెవెల్‌లో వకీల్‌ సాబ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ ప్లాన్‌ చేసింది యూనిట్‌. అయితే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పోలీస్‌ అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

మరి ఫ్యాన్స్‌ ఊరుకుంటారా అస్సలు ఊరుకోరు. ఇప్పటికే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కోసం కళ్లల్లో ఒత్తులు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో చిత్ర బృందం ప్రీ రిలీజ్‌ను క్యాన్సిల్‌ చేస్తే ఇక అంతే సంగతులు. అందుకే ఓ నిర్ణయాన్ని తీసుకుంది చిత్ర బృందం. హైదరాబాద్‌ శిల్పకళావేదికలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహిస్తోంది. 50 శాతం ఆక్యుపెన్సీతో రేపు సాయంత్రం ఈ వేడుక జరగనుంది.

అసలే పవర్‌స్టార్‌ సినిమా. అందులోనూ బిగ్‌ స్క్రీన్‌పై పవన్‌ చూసి దాదాపు మూడేళ్లు గడుస్తోంది. మరి పవన్‌ భక్తులు ఊరుకుంటారా తమ హీరోను డైరెక్ట్‌గా చూసేందుకు భారీగా తరలివస్తారు. వాళ్లను కట్టడి చేయడం ఎవరితరం కాదు. అందుకే చిత్ర బృందం పాస్‌లు ఉన్నవారే ఈవెంట్‌కు రావాలని సూచించింది.

ఇప్పుడు ఈ పాస్‌ల తంతే చిత్ర బృందం కొంప ముంచింది. ఓ వైపు ఫ్యాన్స్‌ మరో వైపు అతిథులు ఎవరికి పాస్‌లు దొరుకుతాయో తెలియని పరిస్థితి. ఫ్యాన్స్‌కు పాస్‌లు దొరక్కపోతే మాత్రం ఆ లెక్క.. ఆ తిక్క వేరుంటుంది. దీంతో చిత్ర యూనిట్‌ తలపట్టుకుంటోంది. రేపు ఈవెంట్‌ దగ్గర ఏం రచ్చ జరుగుతుందోనని తెగ భయపడుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story