Vakeel Saab: సెకాండాఫ్‌లో సర్‌ప్రైజ్.. మరో మెగా హీరో కనిపిస్తాడని టాక్?

Vakeel Saab: Here is the suspense element of the film!
x
వకీల్ సాబ్ లో పవన్ కళ్యాణ్ (ఫొటో హన్స్ ఇండియా)
Highlights

Vakeel Saab: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం వకీల్ సాబ్ ఏప్రిల్ 9 న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

Vakeel Saab: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం వకీల్ సాబ్ ఏప్రిల్ 9 న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. బాలీవుడ్ హిట్ చిత్రం పింక్ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తన సత్తాను చాటేందుకు కమర్షియల్ హంగులతో రానుంది. అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్ చాలా గ్యాప్ తీసుకుని ఈ సినిమా చేశాడు. దీంతో ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ తో పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. తాజాగా సినిమా సెకాండాఫ్ లో ఓ సస్పెన్స్ అభిమానుల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో ఓ మెగా హీరో అతిధి పాత్రలో కనిపించనున్నట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఫ్లాష్‌బ్యాక్ ట్రాక్‌లో ఓ మెగా హీరో కనిపిస్తాడని డైరెక్టర్ వెల్లడించాడు. అయితే ఆ మోగా హీరో ఎవరనేది తెలియదు. అలాగే ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్ లో శ్రుతి హాసన్ కనిపించనున్నట్లు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతానికి, మేకర్స్ ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఆ మెగా హీరో ఎవరనేది తెలియాలంటే.. 9వ తారీఖు వరకు వేచిచూడాల్సిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను బోనీ కపూర్, దిల్ రాజు నిర్మించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories