Vakeel Saab: నింగికెగసిన టికెట్ల ధరలు?

Vakeel Saab: హోలీ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రాబోతున్నవకీల్ సాబ్ ట్రైలర్ నేడు విడుదల కానుంది.

Venkata Chari
Updated on: 7 April 2021 8:55 PM IST
Vakeel Saab Benifit shows tickets Prices Very High
X

వకీల్ సాబ్ పోస్టర్స్ 

Vakeel Saab: నేడు (మార్చి 29) హోలీ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రాబోతున్న వకీల్ సాబ్ ట్రైలర్ విడుదల కానుంది. సాయంత్రం 6 గంటలకు ట్రైలర్ లాంఛ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈమేరకు పవర్ స్టార్ ఫ్యాన్స్ #VakeelSaabTrailerDay అంటూ హ్యాస్ ట్యాగ్ తోనే ట్రెండ్ రికార్డులు క్రియోట్ చేస్తున్నారు.

అయితే తాజాగా ఓ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ లా మారింది. వకీల్ సాబ్ రిలీజ్ సందర్భంగా చిత్ర నిర్మాత దిల్ రాజ్ రిలీజ్ ముందు రోజు మిడ్ నైట్ షోలు, అలాగే ఉదయాన్నేబెనిఫిట్ షోలు వేసేలా ప్లాన్ చేశారంట. అయితే ఈ షోలకు సంబంధించిన టికెట్స్ రేట్లు మాత్రం నింగిని తాకేలా ఉన్నాయంట.

ఇక మిడ్‌నైట్‌ షో టికెట్‌ ధర రూ.1500, ఉదయం బెనిషిట్‌ షో టికెట్‌ ధర రూ. 500 గా ఫిక్స్ చేశారంట. అలాగే అన్ని ప్రాంతాల్లో మొదటి వారం టికెట్‌ ధర రూ. 200గా ఉండనుంది. కాగా, టికెట్ల రేట్లు పెంచడంతో.. మొదటి రోజు వకీల్ సాబ్‌ కలెక్షన్స్ లో ఎన్నో రికార్డులు సృష్టించనుందని తెలుస్తోంది. ఈ సినిమాకు పవన్రూ. 50 కోట్లు రెమ్యూనరేషన్‌గా తీసుకున్నాడని తెలుస్తోంది.

వేణు శ్రీరామ్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్‌లో విజయం సాధించిన పింక్‌ సినిమాను తెలుగులో వకీల్‌సాబ్‌గా రీమేక్‌గా చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను 'వకీల్ సాబ్'లో పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారు. దీంతో ఈ సినిమాకు భారీ హైప్ క్రియెట్‌ అయ్యింది. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్‌గా కాగా, అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Venkata Chari

Venkata Chari

Next Story