సంక్రాంతి బరిలో వకీల్ సాబ్, కేజీఎఫ్ 2?

సంక్రాంతి బరిలో వకీల్ సాబ్, కేజీఎఫ్ 2?
x

vakeel saab and kgf 2

Highlights

Vakeel Saab And KGF2 : సంక్రాంతి వస్తుంది అంటే కోళ్ళ పందాలతో పాటుగా మనకి గుర్తొచ్చేది సినిమాలే.. ఈ పండగకు పెద్ద పెద్ద సినిమాలు

Vakeel Saab And KGF2 : సంక్రాంతి వస్తుంది అంటే కోళ్ళ పందాలతో పాటుగా మనకి గుర్తొచ్చేది సినిమాలే.. ఈ పండగకు పెద్ద పెద్ద సినిమాలు విడుదలై ప్రేక్షకులు అలరిస్తాయి.. అయితే వచ్చే ఏడాదికి ఏఏ సినిమాలు విడుదల అవుతున్నాయనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇప్పటికే అఖిల్ " మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్", రాజమౌళి "RRR" చిత్రాలు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నట్టుగా వెల్లడించాయి.. ఇప్పుడు కొత్తగా మరో రెండు సినిమాలు సంక్రాంతి బరిలో నిలవనున్నాయని తెలుస్తోంది. అవే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, కన్నడ స్టార్ యశ్ కేజీఎఫ్ 2 చిత్రాలు..

అజ్ఞాతవాసి సినిమా తర్వాత వకీల్ సాబ్ అనే సినిమాని చేస్తున్నారు పవన్ కళ్యాణ్.. ఇది పవన్ కి 26 వ చిత్రం కావడం విశేషం.. .ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటుగా అంజలి, నివేతా థామస్, అనన్య పాండే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకి ఓ మై ఫ్రెండ్ ఫేం వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, బోనీ క‌పూర్‌, దిల్ రాజు కలిసి సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ అయిపోయినట్టే.. కరోనా ప్రభావం లేకుంటే ఈ చిత్రం ఏప్రిల్ లోనే విడుదలయ్యేది.. అయితే ఇప్పుడు ఈ సినిమాని సంక్రాంతి బరిలో నిలిపేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట...

అటు యశ్ హీరోగా నటిస్తున్న కేజీఎఫ్ 2 పరిస్థితి కూడా అంతే.. షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని ముందుగా సమ్మర్ లోనే రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. అప్పుడే కరోనా ప్రభావం దేశంలో మొదలవ్వడంతో సినిమా విడుదల తేదిని వాయిదా వేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని సంక్రాంతి బరిలో దించాలని చూస్తున్నారట.. భారీ హిట్ సాధించిన కేజీఎఫ్ కి సీక్వెల్ రావడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌ తో పాటుగా ప్రకాష్ రాజ్ తదితరులు నటిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories