Sathyameva Jayathe Song: జనం మనిషి రా..నిజం మనిషి రా...

Sathyameva Jayathe Song: వరుస సినిమాలతో జోరుమీదున్నాడు పవర్ స్టార్. తన రీ- ఎంట్రీ మూవీ 'వకీల్ సాబ్' షూటింగ్ పూర్తి చేశారు పవన్.

Venkata Chari
Updated on: 3 March 2021 5:34 PM IST
Vakeel Saab 2nd Song Sathyameva Jayathe released
X

పవన్ కళ్యాణ్ (ఫోటో యూట్యూబ్)

Sathyameva Jayathe Song: వరుస సినిమాలతో జోరుమీదున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తన రీ- ఎంట్రీ మూవీ 'వకీల్ సాబ్' షూటింగ్ పూర్తి చేశారు పవన్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్‌, టీజర్‌, మగువ మగువ సాంగ్ భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. తాజాగా వకీల్ సాబ్ సినిమా నుంచి 2వ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే పాపులర్ సింగర్ శంకర్ మహదేవన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఈ చిత్రంలో పాడిన 'సత్యమేవ జయతే' సాంగ్‌ను రిలీజ్ చేసి, గ్రాండ్ గా విసెష్ చెప్పారు టీం యూనిట్.

ప్రస్తుతం రిలీజైన సత్యమేవ జయతే సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. ఈ పాటతోనే సినిమా ఎలా ఉండబోతోందో అని చెప్పకనే చెప్పారు మేకర్స్. ప్రజా సమస్యలపై పోరాడి, వారి పక్షాన నిలబడేందుకు ఎంతకైనా తెగించే పాత్రలో పవన్ అలరించనున్నాడు. పాటలో కూడా ఇదే విషయాన్ని చూపించారు. ఈ పాటను శంకర్ మహదేవన్, ప్రిద్వి చంద్ర పాడగా, రామజోగయ్య శాస్త్రి రచించారు.

నిన్న రిలీజ్ చేసిన పోస్టర్ లో పవన్ కళ్యాణ్ లాయర్ గెటప్‌లో కోటు ధరించి కనిపిస్తుండగా.. ఆయన వెనుక మహాత్మ గాంధీ ఫొటో ఉంది. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'పింక్' తెలుగు రీమేక్‌గా తీసుకొస్తున్నారు డైరెక్టర్ వేణు శ్రీరామ్. పవన్ ఇమేజ్‌, తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా చాలా మార్పులు చేశారట. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ సినిమాలో పవర్ స్టార్ సరసన అంజలి, నివేత థామస్, అనన్య నాగేళ్ల హీరోయిన్లుగా నటిస్తున్నారు. శృతి హాసన్ ముఖ్యపాత్ర పోషిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 9న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.


Venkata Chari

Venkata Chari

Next Story