Konda Polam Movie: నేడు మొదటి పాట విడుదల చేయబోతున్న "కొండపోలం" టీమ్

admin1
Updated on: 27 Aug 2021 4:30 PM IST
Vaishnav Tej Rakul Preeth Konda Polam Movie First Song to be Out Today 27th August 2021
X

కొండపొలం(ట్విట్టర్ ఫోటో)

Konda Polam Movie Song: సుప్రీమ్ స్టార్ సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ తాజాగా బుచ్చిబాబు దర్శకత్వంలో "ఉప్పెన" అనే సినిమాతో హీరోగా మారిన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకొన్న సంగతి తెలిసిందే. వరుస ఆఫర్లతో ముందుకు దూసుకు పోతున్న ఈ యువహీరో ప్రస్తుతం రెండవ సినిమా తో బిజీగా ఉన్నాడు. అసలు 'ఉప్పెన' సినిమా విడుదల కాకముందే వైష్ణవ్ తేజ్ క్రిష్ దర్శకత్వంలో ఒక చిత్ర షూటింగ్ ని పూర్తి చేశాడు కానీ ఇంకా విడుదలకు నోచుకోలేదు.

కొండపొలం అనే నవల ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. రూరల్ బ్యాక్ డ్రాప్ తో నడవనున్న ఈ సినిమా నుండి మొదటి పాట నేడు అనగా ఆగస్టు 27న విడుదల కాబోతోంది. "ఒబులమ్మా" అనే పాట ఈరోజు సాయంత్రం 6 గంటలకు విడుదల కాబోతుంది. దీనికి సంబందించిన పోస్టర్ లో రకుల్ లంగా వోణి లో అందాలు ఒలకబోస్తుండగా వైష్ణవ్ కూడా ఆమెను చూస్తూ మైమరచిపోయాడు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదల గురించి అధికారిక ప్రకటన ఇంకా బయటకు రావాల్సి ఉంది.

admin1

admin1

Next Story