Vaishnav - Krish: వైష్ణవ్ తేజ్ - క్రిష్ సినిమాపై అమెజాన్ ప్రైమ్ కన్ను

admin1
Updated on: 3 Aug 2021 12:28 PM IST
Vaishnav Tej New Movie with Director Kirsh Maybe Release on Amazon Prime Video
X

వైష్ణవ్ తేజ్ - క్రిష్ సినిమా పై కన్నేసిన అమెజాన్ ప్రైమ్ వీడియో

Vaishnav Tej - Krish New Movie: సుప్రీమ్ స్టార్ సాయి ధరంతేజ్ తమ్ముడైన వైష్ణవ్ తేజ్ ఈమధ్యనే బుచ్చిబాబు దర్శకత్వంలో ఉప్పెన అనే సినిమాతో హీరోగా మారిన సంగతి తెలిసిందే. మొదటి చిత్రంతోనే మంచి హిట్ అందుకొని వరుస ఆఫర్లతో ముందుకు దూసుకు పోతున్నాడు ఈ యువహీరో. మొదటి సినిమా సూపర్ హిట్ అవడంతో ప్రస్తుతం అందరూ వైష్ణవ్ రెండవ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజానికి 'ఉప్పెన' మూవీ విడుదల కాకముందే వైష్ణవ్ తేజ్ క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా షూటింగ్ ని పూర్తి చేశాడు.

కొండపొలం అనే నవల ఆధారంగా నిర్మితమైన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. రూరల్ బ్యాక్ డ్రాప్ తో విడుదల కాబోతున్న ఈ సినిమాకు అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి మంచి ఆఫర్ లభించినట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలా లేక అమెజాన్ ప్రైమ్ వీడియో ఆఫర్ ను అంగీకరించాలా అని దర్శక నిర్మాతలు ఇంకా ఒక నిర్ణయానికి రావాల్సి ఉంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

admin1

admin1

Next Story