పరువు హత్యల నేపథ్యంతో మెగా హీరో సినిమా

పరువు హత్యల నేపథ్యంతో మెగా హీరో సినిమా
x
Highlights

గత కొంతకాలంగా మెగా హీరోల జాబితాలో మరో కొత్త హీరో పేరు చేరబోతున్న వార్తలు వింటూనే ఉన్నాం. అతను ఎవరో కాదు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్. సుకుమార్...

గత కొంతకాలంగా మెగా హీరోల జాబితాలో మరో కొత్త హీరో పేరు చేరబోతున్న వార్తలు వింటూనే ఉన్నాం. అతను ఎవరో కాదు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్. సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. తాజాగా విజయ్ సేతుపతి ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఇక ఈ సినిమాకి 'జాలరి' అనే టైటిల్ ను ఖరారు చేసినట్లుగా వార్తలు బయటకు వస్తున్నాయి కానీ అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది.

అయితే తాజాగా ఈ సినిమా కథ గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో హీరో జాలరి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా కనిపిస్తాడట. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ మాత్రం బాగా డబ్బున్న కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి గా కనిపిస్తుందట. అంతేకాక ఈ సినిమాలో పరువు హత్యల కాన్సెప్ట్ కూడా ఉండబోతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. నిజానికి ఈ కాన్సెప్ట్ తో వచ్చిన తెలుగు సినిమాలలో హిట్ అయిన సినిమాలు చాలా తక్కువ. మరి వైష్ణవ తేజ్ ఈ నేపథ్యంతో హిట్ ఉంటాడో లేదో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories