Seenayya: హీరోని అన్నావు.. సినిమా అన్నావు.. "సీనయ్య" ఎక్కడున్నావయ్యా..!?

* దిల్ రాజు నిర్మాతగా దర్శకుడు వినాయక్ హీరోగా నటించిన "సీనయ్య" సినిమాకి ఏమైంది..!?

Sandeep Reddy
Published on: 15 Nov 2021 3:26 PM IST
V V Vinayak Seenayya Movie Release Delay Due to Vinayak Not Satisfy With Movie Output
X

Seenayya Movie: హీరోని అన్నావు.. సినిమా అన్నావు.. "సీనయ్య" ఎక్కడున్నావయ్యా.. 

Seenayya Movie: "దిల్" సినిమాతో అప్పటివరకు డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న రాజును నిర్మాత దిల్ రాజు గా పరిచయం చేసి సినిమాతో ఘనవిజయాన్ని అందించాడు దర్శకుడు వివి వినాయక్. వినాయక్ ఋణం తీర్చుకోవడానికో లేదా వినాయక్ మీద ఉన్న అభిమానంతోనో తెలియదు కాని దిల్ రాజు.. ఈ దర్శకుడిని కాస్త హీరోగా చూపించాలనే కంకణం కట్టుకున్నాడు. అంతే వివి వినాయక్ హీరోగా "సీనయ్య" సినిమాని ప్రకటించేశాడు దిల్ రాజు. అయితే నరసింహ దర్శకత్వంలో వినాయక్ హీరోగా నటించిన "సీనయ్య" సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకున్నా సినిమా అవుట్ పుట్ మాత్రం వినాయక్ కి నచ్చకపోవడంతో సినిమా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ వెనుకాడుతున్నారని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

దాదాపు రెండేళ్ళ క్రితమే పూర్తయిన ఈ సినిమా ఇక పక్కన పెట్టారని తెలుస్తుంది. "సీనయ్య" సినిమా లాంచ్ సమయంలో మాట్లాడిన వినాయక్ నేను హీరో ఏంటి అని అనుకున్నానని, సినిమా వల్ల ఫిట్ గా ఉండటానికి జిమ్ కి అయిన వెళ్ళే అవకాశం దొరికిందని కథ కూడా బాగా నచ్చిందని మీడియా ముఖంగా చెప్పుకొచ్చాడు. ఒకానొక సందర్భంలో నటుడు బ్రహ్మానందం కూడా మరీ అంత ఖాళీగా ఉంటే మాత్రం హీరోగా చేయడం ఏంటి అంటూ వినాయక్ కి చురకలు అంటించాడు.

దర్శకుడిగా "ఖైదీ నంబర్ 150" సినిమా తరువాత ఒక్క సినిమా కూడా చేయని వినాయక్ ఖాళీగా ఉన్నాడని ఆ సినిమా ఒప్పుకున్నాడా లేదా దిల్ రాజు కోరిక మేరకు ఒప్పుకున్నాడో తెలియదు కాని మొత్తానికి ఈ సినిమా మాత్రం అటకెక్కిందని టాక్ వినిపిస్తుంది. అన్నట్టు ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీత దర్శకుడిగా పని చేశాడు. ప్రస్తుతం ఇవన్ని మరిచిపోయి వివి వినాయక్.. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా "ఛత్రపతి" సినిమా హిందీ రీమేక్ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ బిజీగా ఉన్నాడు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story