UV Creations : కొత్త దర్శకులను ఎంకరేజ్ చేస్తున్న యువీ క్రియేషన్స్

UV Creations : కొత్త దర్శకులను ఎంకరేజ్ చేస్తున్న యువీ క్రియేషన్స్
x
Highlights

UV Creations : తెలుగు చిత్రపరిశ్రమలో చాలా నిర్మాణ సంస్థలు ఉన్నాయి.. కానీ కొత్త దర్శకులను ఎంకరేజ్ చేసే బ్యానర్స్ మాత్రం కొన్ని మాత్రమే ఉన్నాయని

UV Creations : తెలుగు చిత్రపరిశ్రమలో చాలా నిర్మాణ సంస్థలు ఉన్నాయి.. కానీ కొత్త దర్శకులను ఎంకరేజ్ చేసే బ్యానర్స్ మాత్రం కొన్ని మాత్రమే ఉన్నాయని చెప్పాలి. అప్పట్లో మూవీ మొఘల్ రామానాయుడు కొత్త కొత్త దర్శకులకు అవకశాలు ఇస్తూ వారిలోని టాలెంట్ ని బయటకు తీస్తూ వారిని ప్రోత్సహించేవారు.. ఇక ఈ జనరేషన్ లో దిల్ రాజు చాలా మంది కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ టాలెంటెడ్ డైరెక్టర్ లను ముందుకు తీసుకువచ్చారు.. అందులో బోయపాటి శ్రీను, వంశీ పైడిపల్లి లాంటి టాప్ డైరెక్టర్స్ ఉన్నారు..

అయితే ఇప్పుడు ఇదే బాటలో యూవీ క్రియేష‌న్స్ సంస్థ నడుస్తుందని తెలుస్తోంది.. యూవీ క్రియేష‌న్స్ అంటేనే భారీ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది.. ప్రస్తుతం ఈ సంస్థ ప్రభాస్ హీరోగా వస్తున్న రాథేశ్యామ్ అనే సినిమాని నిర్మిస్తోంది.. ప్రస్తుతం ఈ సినిమా ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. పాన్ ఇండియా మూవీగానే ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా తర్వాత యూవీ క్రియేష‌న్స్ మరే సినిమాకి కూడా కమిట్ కాలేదు. అయితే ప్రస్తుతం యువీ క్రియేషన్స్ వెబ్ సిరీస్ లు, చిన్న సినిమాల మీద దృష్టి పెడుతోందని తెలుస్తోంది. వీటి ద్వారా కొత్త దర్శకులను ఎంకరేజ్ చేసి వారిని ఇండస్ట్రీకి పరిచయం చేయాలనీ భావిస్తుందట.. అందులో భాగంగానే ఇప్పటికే కొత్త డైరక్టర్లను కొంతమందిని రెడీ చేసినట్లుగా సమాచారం..

ప్రముఖ డైరెక్టర్ క్రిష్ దగ్గర అసోసియేట్ గా పని చేస్తోన్న భార్గవ్ అనే వ్యక్తిని డైరెక్టర్ గా పరిచయం చేయడానికి యువీ సంస్థ రంగం సిద్ధం చేసినట్టుగా సమాచారం.. వాస్తవానికి కొత్త వాళ్ళతో ప్రయోగాలు చేయడం కన్నా మారుతి లాంటి దర్శకులు, నాని లాంటి హీరోలతో సినిమాలు చేస్తే బాగానే లాభాలు వస్తాయి..అయితే ఇండస్ట్రీలో కొత్త డైరెక్టర్లు రావాలని, అది తమ సంస్థ ద్వారే రావాలని యూవీ సంస్థ ప్లాన్ చేస్తోందట. ఇక ఇప్పటికే ఈ సంస్థ ద్వారా కొరటాల శివ, సుజిత్, రాధాకృష్ణ కుమార్ లాంటి దర్శకులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories