UV Creations: యూవీ క్రియేషన్స్ సూపర్ ప్లానింగ్..దశ తిరిగినట్లే

UV Creations Planning To Production Small Movies
x

యూవీ ఫైల్ ఇమేజ్ 

Highlights

UV Creations: యూవీ క్రియేషన్స్(UV)టాలీవుడ్ లో ఉన్న పెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటి.

UV Creations: యూవీ క్రియేషన్స్(UV)టాలీవుడ్ లో ఉన్న పెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటి.ఈ సంస్థ ప్రస్తుతం ప్రభాస్ తో 'రాధేశ్యామ్'మూవీని నిర్మిస్తుంది. భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తూనే చిన్న సినిమాల వైపు దృష్టి పెట్టింది. 'ఏక్ మినీ కథ'కు స్టోరీ అందించిన దర్శకుడు మేర్లపాక గాంధీతో మరో కథ రెడీ చేయించింది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతుంది. అది కూడా ఓ బోల్డ్ కాన్సెప్ట్ తో తెరకెక్కే సినిమా అని తెలుస్తోంది. ఇది కాకుండా మారుతితో సైలెంట్ గా మరో సినిమా మొదలుపెట్టింది.

ఇందులో కూడా సంతోష్ శోభన్ నే హీరోగా తీసుకున్నారు. నెల రోజుల్లో ఈ సినిమాను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ కూడా రెండు కోట్ల లోపే అని తెలుస్తోంది. ఈ సినిమా పూర్తవ్వక ముందే బేరం కుదిరిపోయిందట. 'ఆహా' సంస్థ ఎక్కువ మొత్తం చెల్లించి ఈ సినిమా రైట్స్ ను తీసుకుందట. దాదాపు అనుకున్న బడ్జెట్ కి మూడు రెట్లు ఎక్కువ మొత్తం ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. రిలీజ్ కు ముందే ఈ రేంజ్ లో లాభాలు రావడం విశేషమనే చెప్పాలి.

ఇటీవల సంతోష్ శోభన్ హీరోగా 'ఏక్ మినీ కథ' అనే సినిమాను నిర్మించింది. అమెజాన్ లో విడుదలైన ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చింది. కేవలం రెండు కోట్లతో నిర్మించిన ఈ సినిమాను అమెజాన్ సంస్థ ఏకంగా తొమ్మిది కోట్లు పెట్టి కొనుక్కుంది. దానికి కారణం యూవీ క్రియేషన్స్ బ్యానర్ కు ఉన్న బ్రాండ్ వాల్యూ అనే చెప్పాలి. చిన్న సినిమాల్లో ఇంత లాభం ఉందని గ్రహించిన ఈ సంస్థ ఇప్పుడు అదే తరహాలో మరిన్ని సినిమాలను నిర్మించడానికి రెడీ అవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories