UV Creations: ఇద్దరు స్టార్ హీరోలను కలపనున్న యు.వి.క్రియేషన్స్

UV Creations: రామ్ చరణ్ ప్రభాస్ లతో సినిమా ప్లాన్ చేస్తున్న టాప్ ప్రొడక్షన్ బ్యానర్

admin1
Published on: 16 Aug 2021 1:27 PM IST
UV Creations Planned a Movie With Ram Charan And Prabhas
X

రామ్ చరణ్ మరియు ప్రభాస్ తో మూవీ ప్లాన్ చేస్తున్న యూవీ క్రియేషన్స్ (ఫైల్ ఇమేజ్)

UV Creations: ఈ మధ్యకాలంలో మల్టీ స్టారర్ ల హవా బాగానే నడుస్తుంది. స్టార్ హీరోలు సైతం మల్టీస్టారర్ సినిమాల్లో నటించేందుకు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ మరియు రానా కలిసి ఒక రీమేక్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు వరుణ్ తేజ్, వెంకటేష్ కూడా "ఎఫ్ 3" సినిమాతో బిజీగా ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం మరో ఇద్దరు స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్లో కనిపించడానికి సిద్ధమవుతున్నారు. వారే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ ప్రభాస్ హీరోలుగా ఒక సినిమాని ప్లాన్ చేస్తున్నారట. ప్రముఖ ప్రొడక్షన్ బ్యానర్ యు.వి.క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

యు.వి.క్రియేషన్స్ ప్రభాస్ కు ఒకరకంగా హోమ్ ప్రొడక్షన్ బ్యానర్ లాంటిదే. మరో వైపు రామ్ చరణ్ తో కూడా యు.వి.క్రియేషన్స్ కు మంచి సాన్నిహిత్యం ఉంది. అయితే తాజాగా ఒక యువ దర్శకుడు యు.వి.క్రియేషన్స్ కు ఒక మంచి ప్రేమకథను వినిపించగా నిర్మాతలకు అది చాలా బాగా నచ్చిందట. ఆ సినిమాలో హీరోలుగా ప్రభాస్ మరియు రామ్ చరణ్ నటిస్తే చాలా బాగుంటుందని యు.వి.క్రియేషన్స్ ఆలోచన. ఈ ఇద్దరు స్టార్ హీరోలు కూడా ఈ సినిమా చేసేందుకు కచ్చితంగా ఒప్పుకుంటారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి రామ్ చరణ్ "ఆర్ఆర్ఆర్" చిత్రంతో బిజీగా ఉండగా ప్రభాస్ కూడా "రాధే శ్యామ్", "సలార్" వంటి చిత్రాలతో బిజీగా ఉన్నాడు. మరి వీరిద్దరితో సినిమా ఎలా ఉండబోతోందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

admin1

admin1

Next Story