Buchi Babu Sana: స్టార్ హీరోతో సినిమా చేయబోతున్న బుచ్చిబాబు

Buchi Babu Sana: ఎన్టీఆర్ తో చేతులు కలపనున్న "ఉప్పెన" డైరెక్టర్

admin1
Updated on: 19 Nov 2021 6:00 PM IST
Uppene Movie Director Buchi Babu Going to do a Film With NTR
X

స్టార్ హీరో తో సినిమా చేయనున్న బుచ్చిబాబు (ఫైల్ ఇమేజ్)

Buchi Babu Sana: ఈ మధ్యనే "ఆర్ ఆర్ ఆర్" సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన వేలు ఫ్రాక్చర్ అవడంతో సర్జరీ చేయించుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేసి రెస్ట్ తీసుకుంటున్నారు. వచ్చే ఏడాది వరకు ఏ షూటింగ్ లోనూ పాల్గొనకూడదని నిర్ణయించుకున్నారు ఎన్టీఆర్. ఇక మరోవైపు వచ్చే ఏడాది జనవరిలో విడుదల కాబోతున్న "ఆర్ ఆర్ ఆర్" చిత్ర ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న యంగ్ టైగర్ ఈ సినిమా తర్వాత స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. "జనతా గ్యారేజ్" తర్వాత ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రెండవ సినిమా ఇది.

భారీ అంచనాల మధ్య తెరకెక్కనున్న ఈ సినిమా త్వరగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఒక యువ డైరెక్టర్ కూడా ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నారట. ఆయన మరెవరో కాదు ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బుచ్చిబాబు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న బుచ్చిబాబు ఎన్టీఆర్ కి కథ వినిపించి మెప్పుంచారట. ఇక తాజాగా ఈ స్క్రిప్ట్ డ్రాఫ్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు బుచ్చిబాబు. ఒక స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన త్వరలోనే విడుదల కాబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

admin1

admin1

Next Story