OTT: ఓటీటీలో ఉప్పెన, వైల్డ్ డాగ్ సినిమాలు... ఎప్పుడంటే

Uppena, Wild Dog Movies in OTT
x

ఉప్పెన, వైల్డ్ డాగ్ సినిమాలు ఓటీటీలో విడుదల

Highlights

OTT: బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'ఉప్పెన', బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టిన వైల్డ్ డాగ్ సినిమాలు ఓటీటీలో రిలీజ్ కానున్నాయి.

OTT: ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన 'ఉప్పెన', విమర్శకులు మెచ్చినా.. బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టిన వైల్డ్ డాగ్ సినిమాలు ఓటీటీలో విడుదల కానున్నాయి. చిన్నసినిమాగా విడుదలైన ఉప్పెన సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టింది. హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతిశెట్టి, విలన్ విజయ్ సేతుపతి, డైరెక్టర్ బుచ్చిబాబు.. ఇలా ఈ నలుగురు ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో డెబ్యూ చేశారు.

అయితే విడుదలైన రెండు నెలల తర్వాత ఉప్పెన సినిమా టీవీలో ప్రసారం కాబోతుంది. స్టార్ మా ఛానల్లో ఉప్పెన సినిమాను ఏప్రిల్ 18న సాయంత్రం 6గంటలకు ప్రసారం చేయనున్నట్లు స్టార్ మా యాజమాన్యం ట్విట్టర్ లో ప్రకటించింది. అలాగే ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో ఏప్రిల్ 14 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఈ సూపర్ హిట్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా.. డైరెక్టర్ సుకుమార్ సమర్పకుడిగా వ్యవహరించారు.

క్రిటిక్స్ ప్రశంసలు అందుకుని బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది అక్కినేని నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమా. ఈ సినిమా మే మూడోవారం నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. ఎన్.ఐ.ఏ తీవ్రవాద ఆపరేషన్ నేపథ్యంలో ఈ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయింది.

నిజానికి వైల్డ్ డాగ్ రూ .27 కోట్ల డీల్ తో ఓటీటీ కోసం నిర్మించారని ప్రచారమైంది. కానీ ఉప్పెన -జాతి రత్నాలు ఫలితాతో మేకర్స్ థియేటర్లలో రిలీజ్ చేశారు. బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది.

Show Full Article
Print Article
Next Story
More Stories