Uppena: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..ఉప్పెన బిగ్ అప్డేట్ వచ్చేసింది

uppena File Photo
x

ఉప్పెన ఫైల్ ఫోటో 

Highlights

Uppena: నీ కన్ను నీలి సముద్రం సాంగ్‌ అశేష తెలుగు ప్రేక్షకులను షేక్ చేసేసింది.

Uppena: నీ కన్ను నీలి సముద్రం సాంగ్‌ అశేష తెలుగు ప్రేక్షకులను షేక్ చేసేసింది. ఈ పాట కొన్నాళ్ల పాటు మొబైల్ యూజర్ల రింగ్ టోన్ గా సెట్ చేసుకున్నారు. గత ఏడాది కరోనా కారణంగా వాయిదా పడి. ఎట్టకేలకు ఈ ఏడాది విడుదలైన టాలీవుడ్ బిగ్గెస్గ్ బాక్సాఫీస్ హిట్ అందుకున్న సినిమాల్లో ఉప్పెన ఒకటి. ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సాలీడ్ కలెక్షన్స్ అందుకుంది.

మరోవైపు ఉప్పెన తర్వాత రిలీజ్ అయిన సినిమాలు ఓటీటీల్లో వస్తున్నాయి. అయితే ఉప్పెన స్ట్రీమ్ కాకపోవడంపై అభిమానులు కాస్త నిరాశకు లోనైయ్యారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ఓ వర్గం ఆడియెన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. మొదట్లో ఏప్రిల్ తుది వారంలో రావచ్చని టాక్ వచ్చింది. కానీ ఆ రూమర్స్ నిజం కాదు. మొత్తానికి కొత్త డేట్ పై క్లారిటీ వచ్చేసింది. నెట్ ఫ్లిక్స్ లో ఏప్రిల్ 12న విడుదల చేయనున్నారు. ఈ డేట్ లో ఎలాంటి మార్పులు లేవట. ఈ సారి కచ్చితంగా చెప్పిన రోజే వస్తుంద తేల్చిచెబుతున్నారు.

వైష్ణవ్ తేజ్ - కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా వెండితెరకు పరిచయం అయ్యారు. అలాగే కొత్త దర్శకుడు బుచ్చిబాబుకు కూడా ఈ సినిమా వల్ల మంచి ఆఫర్స్ వస్తున్నాయి. సుకుమార్ రైటింగ్స్ - మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మించింది. నిర్మాతలకు బయ్యర్లకు నెవర్ బిఫోర్ అనేలా పెట్టినపెట్టుబడికి మంచి లాభాలు వచ్చాయి. ఈ సినిమా ఓటీటీల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.



Show Full Article
Print Article
Next Story
More Stories