Uppena Movie: ఉప్పెన నుండి 'జలజల జలపాతం నువ్వు' వీడియో సాంగ్ రిలీజ్

Uppena Movie: ఉప్పెన సినిమా నుండి సూపర్ హిట్ సాంగ్ 'జలజల జలపాతం నువ్వు'వీడియో సాంగ్ రిలీజ్ అయ్యింది

Kranthi
Updated on: 19 March 2021 12:11 PM IST
Uppena Movie Jala Jala Jalapaatham Nuvvu Video Song Released
X

ఉప్పెన మూవీ (ఫోటో: ఫైల్ ఇమేజ్)

Uppena Movie: తొలి సినిమాతో ప్రేక్షకుల మనసు దోచేసిన మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన 'ఉప్పెన' చిత్రం ఈనెల ఫిబ్రవరి 12న విడుదలయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్ టాక్‌ను అందుకుని వసూళ్ల వర్షం కురిపించింది. అయితే 'ఉప్పెన' టీమ్‌ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'జలజల జలపాతం నువ్వు' వీడియో సాంగ్‌ని తాజాగా విడుదల చేసింది. దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన స్వరాలకు శ్రేయాఘోషల్‌, జాస్‌ప్రీత్ జాజ్ గాత్రం తోడవడంతో సినిమా విడుదలకు ముందే ఈ పాటకు ఎంతో పాపులారిటీ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఈ మెలోడికి సంబంధించిన పూర్తి‌ వీడియోని చిత్రబృందం షేర్‌ చేసింది. వైష్ణవ్‌ తేజ్‌, కృతిశెట్టిల హావభావాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. మరోవైపు ఈ పాటను విడుదల చేసిన కొద్దిసేపటికే 32 లక్షల మంది వీక్షించారు. అలాగే 1.55 లక్షల మంది లైక్‌ చేశారు.

వైష్ణవ్‌ తేజ్‌, కృతిశెట్టి జంటగా నటించిన విభిన్న ప్రేమకథా చిత్రం 'ఉప్పెన'. బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. విజయ్‌ సేతుపతి కీలకపాత్రలో కనిపించారు. మైత్రిమూవీ మేకర్స్‌ పతాకంపై ఈ సినిమా నిర్మితమైంది.ఇందులోని పాట‌లు ఈ సినిమాకు ప్ల‌స్ పాయింట్ అయ్యాయి. శ్రీ‌మ‌ణి రాసిన ఈ సినిమా పాట‌లు కొన్ని నెల‌లుగా ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాయి.

Kranthi

Kranthi

Next Story