Uppena Movie: ఉప్పెన తో ఆ రికార్డులు బద్దలు అవుతాయా?

Uppena Movie hero Vaishnav Tej all set to Create new Records in Tollywood
x

ఉప్పెన మూవీ ఫోటో 

Highlights

కొత్త హీరో, కొత్త హీరోయిన్, కొత్త దర్శకుడు ఇటువంటి ఉపమానాలతో సినిమా వస్తోందంటే ఎవరికీ ఆసక్తి ఉండదు. కానీ..ఇటీవల ఒక సినిమాకి మాత్రం ఎక్కడలేని బజ్...

కొత్త హీరో, కొత్త హీరోయిన్, కొత్త దర్శకుడు ఇటువంటి ఉపమానాలతో సినిమా వస్తోందంటే ఎవరికీ ఆసక్తి ఉండదు. కానీ..ఇటీవల ఒక సినిమాకి మాత్రం ఎక్కడలేని బజ్ వచ్చింది. ఆ సినిమా ఉప్పెన. సినిమా ప్రకటన నాటి నుంచి ఇప్పటి వరకూ సినిమా మీద ప్రేక్షకులకు రోజు రోజుకూ ఆసక్తి పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఉప్పెన సినిమా సరికొత్త రికార్డు సృష్టించే అవకాశం ఉందని టాలీవుడ్(Tollywood) చెప్పుకుంటున్నారు.

మెగాస్టార్ వారసుడిగా చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తొలి సినిమాకే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన హీరోగా చరిత్ర సృష్టించారు. అటు తరువాత అక్కినేని వారసుడు అఖిల్ సినిమాతో ఆ రికార్డ్ తిరగరాశారు. ఈ సినిమా 7.5 కోట్లు ఓపెనింగ్స్ రాబట్టింది. హీరో తొలిసినిమాల్లో అత్యధికంగా ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా ఇప్పటికీ ఆ సినిమా రికార్డుల్లో ఉంది. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా అల్లుడు శ్రీను కూడా హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది. ఇప్పుడు ఈ మూడు రికార్డులు బద్దలు కొట్టే ఛాన్స్ ఉప్పెన(Uppena మూవీ) హీరో వైష్ణవ తేజ్ ముందు ఉందనేది టాలీవుడ్ విశ్లేషకుల అభిప్రాయం.

గతేడాది ఏప్రిల్ నెలలో రిలీజ్ కావలసిన ఉప్పెన సినిమా కరోనా మహమ్మారి కారణంగా విడుదల కాకుండా ఆగిపోయింది. అప్పట్లో ఈ సినిమా పై ఎవరికీ పెద్ద అంచనాలు లేవు. కరోనా లాక్ డౌన్ సమయంలో సినిమా పాటలు.. టీజర్లు విడుదలయ్యాయి. విడువులైన ప్రతి పాటా సూపర్ హిట్ అయింది. యూట్యూబ్ లో రికార్డులు సృష్టించాయి. ముఖ్యంగా వైష్ణవ తేజ్.. హీరోయిన్ కృతి శెట్టి ఇద్దరూ సినీ ప్రేమికులతో పాటు టాలీవుడ్ ప్రముఖులను కూడా ఆకట్టుకున్నారు. టీజర్లో ప్రతి సన్నివేశం యువతను గిలిగింతలు పెట్టింది. ఉప్పెన సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని యువత ఎదురుచూసేలా ట్రైలర్లు చేశాయి. దీంతో ఉప్పెన సినిమా పై విపరీతమైన బజ్ వచ్చింది.

కరోనా పరిస్థితులు మారడం.. పూర్తి స్థాయిలో సినిమా హాళ్లు ఓపెన్ కావడంతో ఉప్పెన సినిమాకు మంచి సమయం దొరికింది. అదేవిధంగా ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా సుమారు 200 లొకేషన్లలో విడుదల కాబోతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఈ సినిమా ఓపెనింగ్స్ ఉప్పెన తీసుకురావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ లకు మంచి స్పందన వస్తోంది. అదేవిధంగా థియేటర్లు కూడా టికెట్ రేటు పెంచి టికెట్లు సేల్స్ చేస్తున్నారు. ఈ అంశాలన్నీ సానుకూలంగా ఉండడంతో సినిమా రికార్డు ఓపెనింగ్స్ సాధించడం కష్టం కాకపోవచ్చని అభిప్రాయం కలుగుతోంది.

అందుకే అందరూ కచ్చితంగా ఉప్పెన సినిమా తొలి సినిమా తోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన హీరోగా వైష్ణవ తేజ్ ను నిలబెట్టే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories