'ఉప్పెన' నయా రికార్డ్.. 21 ఏళ్ల చరిత్రను తిరగరాసిన వైష్ణవ్ తేజ్ సినిమా

Uppena Records
x

ఉప్పెన, కహో నా ప్యార్ హై మూవీ 

Highlights

టాలీవుడ్ లో ఇప్పటి వరకు అత్యధికంగా గ్రాస్ వసూలు చేసిన సినిమాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'చిరుత'నే నిలిచింది. ఆ సినిమాతో రామ్ చరణ్ ఇండస్ట్రీలో...

టాలీవుడ్ లో ఇప్పటి వరకు అత్యధికంగా గ్రాస్ వసూలు చేసిన సినిమాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'చిరుత'నే నిలిచింది. ఆ సినిమాతో రామ్ చరణ్ ఇండస్ట్రీలో హీరోగా పరిచయం అయ్యారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ఇప్పటి వరకు టాలీవుడ్ లో అత్యధిక గ్రాస్ వసూలు చేసిన చెర్రీ డెబ్యూ మూవీగా నిలిచింది. ఆ సినిమా రికార్డ్సు అన్ని 12 ఏళ్లుగా అలానే ఉన్నాయి. అయితే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోనే తుడిపేశాడు. 'చిరుత' తన లైఫ్ టైమ్ రన్‌లో వసూలు చేసిన మొత్తాన్ని పంజా వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం 'ఉప్పెన' తొలి వారంలోనే దాటేసింది.

'ఉప్పెన' తొలిరోజు వసూళ్లు చూసినప్పుడే తొలి వారం ముగిసే సరికి 'చిరుత' రికార్డును తిరగరాస్తుందని అందరూ భావించారు. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన 'ఉప్పెన' కేవలం 3రోజుల్లోనే టాలీవుడ్‌లో భారీ గ్రాస్ రాబట్టిన డెబ్యూ హీరో చిత్రంగా నిలిచింది. అంతే కాదు భారత సినీ చరిత్రలో 21 ఏళ్లు పదిలంగా ఉన్న రికార్డ్స్ 'ఉప్పెన' బద్దలుకొట్టింది. హృతిక్ రోషన్ తొలి చిత్రం 'కహో నా ప్యార్ హై' పేరిట ఉన్న రికార్డులను 'ఉప్పెన' బద్దలుకొట్టింది. 'కహో నా ప్యార్ హై'మూవీ లాంగ్ రన్ లో 41 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 'ఉప్పెన' కేవలం 5 రోజుల్లోనే 42 కోట్ల రూపాయలపైగా నెట్ వసూలు చేసి హృతిక్ రోషన్ తొలి చిత్రం రికార్డును తిరగరాసింది.

మరోవైపు 'ఉప్పెన' 5 రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.92 కోట్ల షేర్ వసూలు చేసింది. ఓవర్సీస్ - రూ. 1.6 కోట్లు, కర్ణాటక - రూ. 1.71 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా - రూ. 51 లక్షలు, తమిళనాడు - రూ. 65 లక్షలు, ప్రపంచ వ్యాప్తంగా మొత్తం: రూ. 37.39 కోట్లు రాబట్టిందిం. కృష్ణా - రూ. 2.2 కోట్లు, గుంటూరు - రూ. 2.65 కోట్లు, నెల్లూరు - రూ. 1.14 కోట్లు నైజాం - రూ. 11.03 కోట్లు, ఉత్తరాంధ్ర - రూ. 5.59 కోట్లు, సీడెడ్ - రూ. 5.17 కోట్లు, తూర్పుగోదావరి - రూ. 3.23 కోట్లు, పశ్చిమ గోదావరి - రూ. 1.91 కోట్లు వసూళ్లతో దూసుపోతుంది. సినిమా టాక్ ఎలాఉన్న వసూళ్ల పరంగా నిర్మాతకు కాసుల పంట పండిస్తోంది. ఈ సినిమాలో కన్నడ భామ కృతి శెట్టి హీరోయిన్ గా ఆకట్టుకోగా.. విజయ్ సేతుపతి క్యారెక్టర్ సినిమాకే హైలెట్ గా నిలిచింది.

Show Full Article
Print Article
Next Story
More Stories