Uppena Making Video: ఉప్పెన.. మేకింగ్‌ వీడియోలు చూశారా..?

Uppena Making Video: టాలీవుడ్ లో ఈ ఏడాది విడుదలై బ్లాక్‌బస్టర్‌ కొట్టిన సినిమాల్లో ‘ఉప్పెన’ ఒకటి.

Venkata Chari
Published on: 11 April 2021 7:48 PM IST
Uppena Making Videos Released by Director Buchhi Babu Sana
X

ఉప్పెన మూవీ మేకింగ్ వీడియో

Uppena Making Video: టాలీవుడ్ లో ఈ ఏడాది విడుదలై బ్లాక్‌బస్టర్‌ కొట్టిన సినిమాల్లో 'ఉప్పెన' ఒకటి. వైష్ణవ్‌ తేజ్ హీరోగా‌, కృతిశెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ వసూళ్లతో సూపర్‌హిట్‌ అయింది. బుచ్చిబాబు సనా డైరెక్షన్ చేసిన ఈ ప్రేమకథా చిత్రం మైత్రిమూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నిర్మించారు.

కాగా, తాజాగా 'ఉప్పెన' మేకింగ్‌ వీడియోలను దర్శకుడు యూట్యూబ్ లో అప్‌లోడ్ చేశాడు. సినిమా షూటింగ్ సమయంలో తెలుగులో డైలాగ్స్ చెప్పడానికి, హావభావాలు పలికించడానికి కృతి చాలా కష్టపడింది. అంతేకాకుండా 'ఉప్పెన'లో యాక్షన్‌ సీక్వెన్స్, క్లాస్‌రూమ్‌ సన్నివేశాలను ఇందులో చూపించాడు డైరెక్టర్. మీరూ ఓ లుక్కేయండి మరి.

Venkata Chari

Venkata Chari

Next Story