మనసుల్ని ధక్..ధక్..ధక్ అని ఊపేస్తున్న దేవీశ్రీ సంగీత 'ఉప్పెన'

మనసుల్ని ధక్..ధక్..ధక్ అని ఊపేస్తున్న దేవీశ్రీ సంగీత ఉప్పెన
x
Highlights

సముద్రానికి 'ఉప్పెన' వస్తే ఏమవుతుంది? ఊర్లు మునిగిపోతాయి. మనసుకు 'ఉప్పెన' వస్తే ఏమవుతుంది? ప్రేమతో మునిగిపోతారు. మరి సినిమా సంగీతానికి దేవీ శ్రీ...

సముద్రానికి 'ఉప్పెన' వస్తే ఏమవుతుంది? ఊర్లు మునిగిపోతాయి. మనసుకు 'ఉప్పెన' వస్తే ఏమవుతుంది? ప్రేమతో మునిగిపోతారు. మరి సినిమా సంగీతానికి దేవీ శ్రీ 'ఉప్పెన' వస్తే ఏమవుతుంది? ఇదిగో ఇలా ఊపిరి ధక్..ధక్..ధక్.. అంటూ కొట్టుకుంటూ చిటికెలు వేయించేస్తుంది. అవును దేవి శ్రీ ప్రసాద్ మళ్ళీ మ్యాజిక్ చేశారు. కొంత కాలంగా కాస్త వెనుక పడినట్టు కనిపించిన దేవీ మళ్ళీ 'ఉప్పెన'లా విరుచుకు పడుతున్నారు. నీ కన్ను నీలి సముద్రం అంటూ రికార్డుల్ని పలకరించిన కొన్ని రోజులు తిరక్కుండానే.. మనసుల్ని ధక్..ధక్..ధక్.. అంటూ చిన్డులేయిస్తున్నారు దేవీ శ్రీ ప్రసాద్.

మెగా వారసుడిగా తెరంగేట్రం చేస్తున్న సాయి ధరం తేజ్ సోదరుడు వైష్ణవ తేజ్ ఉప్పెన తో తెరమీదకు దూసుకు వస్తున్నారు. ఈయనకు జోడీగా కృతి శెట్టి హీరోయిన్ అందమైన ప్రేమకథను తెలుగు తెరపై పంచబోతున్నారు. ఇప్పుడు ఉప్పెన సినిమాకి సంబంధించిన పాటలు ఒక్కోటి విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో మొదటి పాటగా విడుదల చేసిన నీ కన్ను నీలి సముద్రం అనే పాట ఇప్పటికే పది మిలియన్ల వ్యూస్ దక్కించుకుని యూ ట్యూబ్ ని షేక్ చేస్తోంది. అది రికార్డులు సృష్టిస్తూ పోతున్డగానే.. దేవీ శ్రీ మళ్ళీ కొత్త పాటతో వచ్చేశారు. ఉప్పెన సినిమాలో రెండో వీడియో సాంగ్ విడుదల చేశారు. చిన్ని చిన్ని పదాలతో.. మెలొడీకి తనదైన బీట్ కలగలిపి దేవి శ్రీ వదిలిన ధక్..ధక్..ధక్..ఇప్పుడు కొత్త ట్రెండ్స్ సృష్టిస్తోంది.

నువ్వూ నేను ఎదురైతే ధక్..ధక్..ధక్.. మనసూ మనసూ దగ్గరైతే ధక్..ధక్..ధక్.. ఆశలు అలలై పొంగుతుంటే ధక్..ధక్..ధక్.. అంటూ మరోసారి మాయ చేశారు దేవి శ్రీ ప్రసాద్. చంద్రబోస్ రాసిన ఈ పాట మళ్ళీ ఒక ట్రెండ్ గా మారబోతోంది. శరత్ సంతోష్, హరిప్రియ పాడిన ఈ పాట సినీ పాటల ప్రేమికులకు అమాంతం నచ్చేసింది. ఇక ఈ వీడియో సాంగ్ లో పాటకు చేసిన చిత్రీకరణ, ఎడిటింగ్ విజువల్ వండర్ గా కనిపిస్తున్నాయి. చాలా నాచురల్ గా ఈ పాటను చిత్రీకరించి వదిలారు. అందుకే ప్రస్తుతం ఇది యువత గుండెల్లో ధక్..ధక్..ధక్.. మని మోగుతోంది.

మైత్రీ మూవీ మేకర్స్ పతాకం పై సుకుమార్ కథతో ఈ సినిమా తెఅకేక్కుతోంది. ఈ సినిమాకు సుకుమార్ శిష్యుడు శానా బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. వైష్ణవ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నారు. సినిమా టైటెల్ తోనే సంచలనం సృష్టించింది. కాగా, ఇప్పుడు పాటలతో సినిమా పై మరిన్ని అంచనాలు పెరిగిపోతున్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories