Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌తో ఛాన్స్ కొట్టేసిన ఉప్పెన బ్యూటీ

Pawan Kalyan: ఇక పవన్ కళ్యాణ్ సినిమా కోసం హరీష్ శంకర్ కూడా ఆమెపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం.

Kranthi
Updated on: 6 July 2021 11:08 AM IST
Uppena Heroine Krithi Shetty New Movie With Pawan Kalyan
X

Pawan Kalyan,Krithi Shetty

Krithi Shetty New Movie 2021: ఒక్క సినిమాతో తెలుగు కుర్రాళ్ల మదిని దోచేసింది బేబమ్మ. ఉప్పెన సినిమాలో కృతిశెట్టిని చూసినవారంతా ఫిదా అయిపోయారు. ఈ సొట్టబుగ్గల సుందరాంగి స్టార్ హీరోయిన్ అయి తీరుతుందని జోస్యాలు కూడా చెప్పేసుకున్నారు. అన్నట్లుగానే ఈ బ్యూటీకి ఏకంగా పవన్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. ఇక స్టార్ హీరోయిన్ అవడానికి అవసరమైన క్వాలిఫికేషన్ వచ్చిసినట్లేగా.

సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన సినిమాతో పరిచయమైన వైష్ణవ్ తేజ్ కు ఏ రేంజ్ లో అయితే క్రేజ్ దక్కిందో అదే తరహాలో హీరోయిన్ కృతిశెట్టికి కూడా మంచి గుర్తింపు దక్కింది. దీంతో వెంటవెంటనే యువ హీరోలతో ఛాన్స్ అందుకుంది. ఇక ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో కూడా అవకాశం దక్కించుకుంటున్నట్లు తెలుస్తోంది.

గబ్బర్ సింగ్ కాంబో హరీష్ శంకర్ - పవన్ కళ్యాణ్ మూవీలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారట. ఇక మెయిన్ లీడ్ కోసం ఒక సీనియర్ బ్యూటీని అనుకోని మరొక ముఖ్యమైన పాత్ర కోసం కృతిశెట్టిని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే బెబమ్మ కెరీర్ ఒక్కసారిగా మారిపోయినట్లే. ఆ సినిమా త్వరలోనే మొదలు కానున్నట్లు హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చాడు.

ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ మూడు సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సుధీర్ బాబు 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', రామ్ - లింగుస్వామి సినిమాలతో పాటు నాని చేస్తున్న శ్యామ్ సింగరాయ్ లో కూడా హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఇక పవన్ కళ్యాణ్ సినిమా కోసం హరీష్ శంకర్ కూడా ఆమెపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం.

Kranthi

Kranthi

Next Story