Uppena: 'ఉప్పెన' డైరెక్టర్ కి బంపర్‌ ఆఫర్‌

Uppena: 'ఉప్పెన' చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే.

Venkata Chari
Updated on: 19 Feb 2021 9:40 PM IST
Uppena Director Will Going Direct Jr Ntr Next Movie
X

ఉప్పెన డైరెక్టర్ బుచ్చి బాబు, ఎన్టీఆర్  

క్రియోటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ శిష్యుడు బుచ్చి బాబు తొలిసారి తెరకెక్కించిన 'ఉప్పెన' చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద రికార్డులు కురిపిస్తోంది. దీంతో పరిశ్రమలో బుచ్చిబాబుకు క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఆయనకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. 'డియర్‌ కామ్రేడ్‌', 'సవ్య సాచి' చిత్రాల పరాజయం, ఆ తర్వాత లాక్‌డౌన్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌ నష్టాలు చూడాల్సి వచ్చింది. అనంతరం వచ్చిన ఉప్పెన చిత్రం భారీ స్థాయిలో కలెక్షన్లు రాబడుతోంది. దీంతో నిర్మాతలు బుచ్చిబాబుకు ఇళ్లు కావాలో, కారు కావాలో నిర్ణయించుకోమని బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు.

అంతేగాక ఆయనతో పనిచేసేందుకు టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు, నిర్మాతలు క్యూ కడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కింగ్‌ నాగార్జున తన తనయుడు అఖిల్‌ అక్కినేని కోసం ఓ మంచి ప్రేమకథ సిద్ధం చేయమని బుచ్చిబాబుకు ప్రపోజల్‌ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌తో (‍NTR) ఓ సినిమా చేసేందుకు ఆయనకు అవకాశం వచ్చినట్లు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో సుకుమార్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా 'నాన్నకు ప్రేమతో..' మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు బుచ్చిబాబు అసిస్టెంట్‌‌ డైరెక్టర్‌ పని చేశాడు. ఆ సమయంలో యంగ్‌ టైగర్‌తో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్‌ బుచ్చిబాబుతో మూవీ చేసేందుకు ఆసక్తిని చూపుతున్నట్లు సమాచారం. అయితే ఈ మూవీని కూడా మైత్రీ మూవీస్‌ మేకర్స్‌ సంస్థ నిర్మించేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే మరి.

Venkata Chari

Venkata Chari

Next Story